రహస్య కెమెరాల నుంచి తప్పించుకోవటం ఏలా..?

రహస్య కెమెరాల ద్వారా షూట్ చేయబడిన అనేక వీడియో టేప్‌లను యూట్యూబ్‌లో అనేక చూస్తున్నాం. సెక్యూరిటీ అంశాల దృష్ట్యా ఏర్పాటు చేయబడని సీసీకెమెరాలు, మైక్రోఫోన్‌లను చట్టవిరద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ ట్రాప్‌లో ఇరుక్కున్న పలువురు మహిళలు ఆత్మహ్యతలకు పాల్పిడన సంఘటనలు మీడియా ద్వారా చాలానే వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆడవారు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో సీసీ కెమెరాల అదేవిధంగా మైక్రోఫోన్‌ల విషయంలో అప్రమత్తత వహించాల్సి ఉంది. ఇవి జాగ్రత్తలు......
- మీరు వెళ్లిన ట్రెయిల్ రూమ్ లేదా రీఫ్రెష్ రూమ్‌లో అద్దాలు, పెయింటింగ్స్, పూల మొక్కలు ఇలా అన్ని వస్తువులను నిశితంగా పరిశీలించండి. సీసీకెమెరాలను ఎక్కువుగా ఇలాంటి ప్రదేశాల్లోనే అమరుస్తారు.
- సీసీకెమెరా లేదా మైక్రోఫోన్‌లను సీలింగ్స్ అదేవిధంగా లైట్‌లలో అమర్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వాటి పైనా ఓ కన్నేసి ఉంచండి.
- రూమ్‌లో ఏవైనా వైర్లు బయటకు కనిపిస్తున్నాయేమో చూడండి. ఒక వేళ కనిపిస్తూ వాటిని ఎక్కడ అనుసంధానించారో పసిగట్టండి.
- మీరు బస చేసిన గదిలో మైక్రోఫోన్ లేదా సీసీకెమెరా అమర్చినట్లయితే బజర్ శబ్ధాలు వినిపిస్తాయి. కాబట్టి శబ్ధాలను క్షుణ్నంగా ఆలకించండి.
- మార్కట్లోకి కొత్తగా వచ్చిన డిటెక్టర్ మీ వెంట ఉన్నట్లయితే మీ ఉండే కొత్త ప్రదేశంలో ఏఏ సాంకేతిక పరికరాలు ఉన్నాయో ఇట్టే కనిపెట్టవచ్చు.


Click it and Unblock the Notifications