ఈ Photoshop skills మీకు తెలుసా..?

|

సోషల్ మీడియా రాకతో ఫోటోగ్రఫీ.. ఫోటో ఎడిటింగ్‌ విభాగాలకు మరింత ఆదరణ ఉంది. ఫోటోగ్రఫీ రంగంలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరు ఫోటో ఎడిటింగ్ పై కనీస అవగాహనను ఏర్పరుచుకోవల్సి ఉంటుంది. ఫోటోగ్రఫీ విభాగంలో మీరు ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటన్నట్లయితే బేసిక ఫోటో ఎడిటింగ్ పై కూడా పట్టు సాధించాల్సి ఉంది. మీలోని ఫోటోషాప్ స్కిల్స్‌ను మరింతగా సానపెట్టేందుకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్...

బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ (Brightness and contrast )

బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ (Brightness and contrast )

ఫోటో ఎడిటింగ్ విభాగంలో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఫోటోలను ఎడిట్ చేసే సమయంలో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ టూల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా Exposureలోని లోపాలను సవరించుకునే వీలంటుంది. తద్వారా ఫోటో మరింత ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తుంది. ఈ ఎడిటింగ్ టూల్ ప్రతి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లోనూ లభ్యమవుతుంది.

కర్వ్స్ అండ్ లెవల్స్ (Curves and levels)

కర్వ్స్ అండ్ లెవల్స్ (Curves and levels)

ముఖ్యమైన బేసిక్ ఫోటో ఎడిటింగ్ టూల్స్‌లో కర్వ్స్ అండ్ లెవల్స్ కూడా ఒకటి. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేది మొత్తం ఇమేజ్‌కు అప్లై అయితే, కర్వ్స్ అండ్ లెవల్స్ అనేవి మాత్రం ఫోటోలోని కావల్సిన పాయింట్లను మత్రమే ట్యూన్ చేసుకునేందుకు సహకరిస్తాయి. ఈ టూల్‌తో ఫోటోలోని బ్లాక్, వైట్ ఇంకా గ్రే పాయింట్‌లను పిక్ చేసుకుని వాటిని మాత్రమే మరింత సరళంగా ట్యూన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎడిటింగ్ టూల్ ప్రతి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లోనూ లభ్యమవుతుంది.

సాట్యురేషన్ (Saturation)
 

సాట్యురేషన్ (Saturation)

ముఖ్యమైన బేసిక్ ఫోటో ఎడిటింగ్ టూల్స్‌లో సాట్యురేషన్ కూడా ఒకటి. ఈ టూల్ contrastకు చాలా దగ్గరాగా ఉంటుంది. ఈ టూల్ కలర్స్ మధ్య సెపరేషన్‌ను మరింతగా మెరుగుపరుస్తుంది. సాట్యురేషన్ టూల్ అనేది వైబ్రెంట్ అలానే డల్ కలర్స్ మధ్య మరింత గుర్తించదగిన ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఎడిటింగ్ టూల్ ప్రతి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

4 కెమెరాలతో Huawei Nova 2i4 కెమెరాలతో Huawei Nova 2i

 Color lookup table (కలర్ లుకప్ టేబుల్)

Color lookup table (కలర్ లుకప్ టేబుల్)

colour look-up table (CLUT) అనేది ఓ ఫోటో ఎడిటింగ్ మెకనిజం. ఈ మెకనిజం ద్వారా ఒక రేంజ్ ఆఫ్ కలర్స్‌ను మరొక రేంజ్ ఆఫ్ కలర్స్‌కు Transform చేసే వీలుంటుంది. మరింత క్లియర్ కట్‌గా చెప్పాలంటే కలర్ లుకప్ టేబుల్ ఫోటోలోని అన్ని రంగులను వేరొక రంగుల్లోకి మార్చేస్తుంది. ఈ టూల్‌ను వినియోగించుకునేటపుడు ఎటువంటి గందరగోళానికిలోను కాకుండా ఉండాలంటే అడ్జస్ట్ మెంట్‌లేయర్‌ను క్లిక్ చేసుకోండి.

హిస్టోగ్రామ్ (Histogram)

హిస్టోగ్రామ్ (Histogram)

ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లలో ముందగానే లోడ్ అయి ఉండే ఈ యాక్యురేట్ గ్రాఫికల్ ర్రీప్రెజంటేషన్ ద్వారా మీ ఇమేజ్‌కు సంబంధించి టోనల్ రేంజ్‌ను తెలుసుకునే వీలుంటుంది. ఈ గ్రాఫ్‌లో x-axis బ్రైట్నెస్‌ను సూచిస్తే, y-axis ఒక్కో టోన్‌కు సంబంధించి పిక్సల్స్‌ను సూచిస్తుంది. హిస్టోగ్రామ్ టూల్‌ను ఉపయోగించుకుని ఇమేజ్‌లోని ఎక్స్‌పోజర్‌ను జడ్జ్ చేయవచ్చు.

క్లోనింగ్ అండ్ హీలింగ్ (Cloning and healing)

క్లోనింగ్ అండ్ హీలింగ్ (Cloning and healing)

క్లోనింగ్ అండ్ హీలింగ్ అనేవి ఫోటో ఎడిటింగ్‌లో ముఖ్యమైన టూల్స్. క్లోన్ స్టాంప్ అలానే హీలింగ్ బ్రష్‌ల ద్వారా ఇమేజ్‌లోని అనవసర ఎలిమెంట్స్‌ను రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎడిటింగ్ టూల్ ప్రతి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

వర్కింగ్ విత్ లేయర్స్ (Working with layers)

వర్కింగ్ విత్ లేయర్స్ (Working with layers)

ఫోటోలోని ప్రతి లేయర్ డేటాను కలిగి ఉంటుంది. ఈ డేటా విజబులిటీ అనేది ఆ లేయర్‌కు సంబంధించిన opacity అలానే బ్లెండింగ్ మోడ్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. టాప్ లేయర్‌లోని opacity లెవల్‌లో మార్పు చేర్పులు చేయటం ద్వారా ఫోటోలో కావల్సిన చోట మార్పులు చేయవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Photography and editing go hand in hand. If you are learning photography, it is better to learn basic editing skills as well. Today, we have listed some of the basic things you need to concentrate on to get your picture right.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X