ఫస్ట్‌లుక్‌లోనే ‘క్లీన్ బౌల్డ్ ’!

ఫోటో కెమెరాల నిర్మాణ సంస్థ పెంటాక్స్, నూతన శ్రేణి మిర్రర్‌లెస్ కెమెరాను రూపొందించింది. పేరు పెంటాక్స్ కె-01, మార్కెట్లో అతిపెద్ద మిర్రర్‌లెస్ కెమెరాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డివైజ్ సమర్థవంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది. ఈ కెమెరాలో నిక్షిప్తం చేసిన పలు సమర్థవంతమైన స్పెసిఫికేషన్‌లు చూడగానే ఆకట్టుకునేవిగా ఉంటాయి.
పెంటాక్స్ కె-01 కీలక ఫీచర్లు:
16 మెగాపిక్సల్ ఏపీఎస్- సెన్సార్,
3 అంగుళాల ఎస్‌సీడీ స్ర్కీన్,
జేపీజీ, డీఎన్‌జీ, ఆర్ఏడబ్ల్యూ ఫార్మాట్ క్యాప్చుర్,
బుల్ట్ - ఇన్ హెచ్‌డిఆర్,
ఎమ్ఎఫ్ ఫోకస్ అసిస్ట్,
ఫోకస్ పీకింగ్ మోడ్,
1080పిక్సల్ వీడియో రికార్డింగ్,
100-25600 (ఐఎస్ వో రేంజ్),
బుల్డ్ క్వాలిటీ,
క్రోమాటిక్ అబ్రేషన్ కరెక్షన్,
బుల్ట్ -ఇన్ ఫ్లాష్,
ఎక్సటర్నల్ హాట్ షూ,
రీఛార్జబుల్ లియోన్ బ్యాటరీ డీ-ఎల్ఐ90,
మల్టీపుల్ లాంగ్వేజ్ సపోర్ట్,
16 కస్టమ్ ఫంక్షన్స్,
ఈ కెమెరాకు ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ సపోర్ట్‌తో పాటు ఎస్‌డీ, ఎస్‌డిహెచ్‌సీ, ఎస్‌డీఎక్స్‌సీ వంటి ఎక్సటర్నల్ మెమెరీ ఆప్షన్ల సౌలభ్యత ఉంది. ఉత్తమ పిక్షర్ క్వాలిటీ కోసం డివైజ్‌లో షేక్ రిడక్షన్ సిస్టంను ఏర్పాటు చేశారు. కెమెరా షూటింగ్ సామర్ధ్యం సెకనుకు 6 ఫ్రేములు. మల్టీపుల్ షూటింగ్ మోడ్ సౌలభ్యతను గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. నలుపు ఇంకా పసుపు రంగు వేరింయట్‌లో కెమెరాను డిజైన్ చేశారు. ఉన్నతమైన ఫోటోగ్రఫీ విలువలతో రూపుదిద్దుకున్న పెంటాక్స్ కె-01 ధర అంచనా రూ.38,000.


Click it and Unblock the Notifications








