క్లిక్ అనిపించిన వెంటనే ఫోటో చేతికి!!

Posted By: Super

 క్లిక్ అనిపించిన వెంటనే ఫోటో చేతికి!!

 

ఫోటో కెమెరాల తయారీ సంస్థ పోలరాయిడ్ విశిష్ట లక్షణాలతో కూడిన సరికొత్త డిజిటల్ కెమెరాను డిజైన్ చేసింది. ఈ కెమెరా పేరు పోలరాయిడ్ జడ్340, ఫోటో చిత్రీకరించిన వెంటను సంబంధిత ఇమేజ్‌ను ఫ్రింట్ రూపంలో తీసుకోవచ్చు. ఈ అద్భుతమతైన తక్షణ (instant) ఫ్రింట్ కెమెరాలో 14 మెగా పిక్సల్ సెన్సార్‌తో పాటు సరకొత్త ప్రిటింగ్ టెక్నాలజీని నిక్షిప్తం చేశారు.

కెమెరా ముఖ్య ఫీచర్లు:

2.7 అంగుళాల ప్రకాశవంతమైన ఎల్‌సీడీ స్ర్కీన్,

ఎస్డీకార్డ్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,

14 మెగా పిక్సల్ సెన్సార్,

సరికొత్త ప్రింటింగ్ టెక్నాలజీ,

రీఛార్జబుల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ.

పాత తరం instant ఫ్రింట్ కెమెరాల పోలికులు కలిగి ఉండే పోలరాయిడ్ Z340 సైజ్ విషయంలో కాస్తంత చిన్నదిగా ఉంటుంది. కెమెరా ముందు భాగంలో అమర్చిన వెడల్పు స్లాట్ ఫ్రింట్ ఇవ్వబడిన ఫోటోగ్రాఫ్‌ను బయటకు విడుదల చేస్తుంది. ఈ క్లాసికల్ డివైజ్ ద్వారా సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీని యూజర్ ఆశించవచ్చు. ఫుల్ బ్యాటరీ చార్జ్ సాయంతో వెంట వెంటనే 25 ఫోటోలను ఫ్రింట్ తీసుకోవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ప్రింటర్ విశిష్టతలు:

- కంప్యూటర్ కనెక్షన్ అవసరం లేదు,

- స్మడ్జ్ ప్రూఫ్ ఫోటోస్ తీసుకోవచ్చు,

- టియర్ రెసిస్టెంట్ ఫోటోలను తీసుకోవచ్చు,

- వాటర్ రెసిస్టెంట్ పోటోలను తీసుకోవచ్చు,

- 3X4” ఫుల్ కలర్ ప్రింట్స్,

- ZINK Zero Ink ప్రింటింగ్ టెక్నాలజీ.

చిత్రీకరణ అనంతరం ప్రింట్ ఇచ్చే ముందు ఫోటోను మీకు నచ్చినట్లు క్రాప్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసిన సమయంతో పాటు ఫైల్ నెంబర్‌ను కూడా ఫోటో పై పొందవచ్చు. మార్కెట్లో పోలరాయిడ్ Z340 ధర రూ.20,000.

‘పోలరాయిడ్ Z340’ కెమెరా సెట్ ద్వారా మీరు పొందే అంశాలు:

డిజిటల్ కెమెరా,

యూఎస్బీ కేబుల్,

10 షీట్ల 3×4” పోలరాయిడ్ జింక్ పేపర్,

ఏసీ ఆడాప్టర్,

ఛార్జర్,

రీఛార్జబుల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot