నికాన్‌తో ‘రఫ్ అండ్ టఫ్ ఫోటోగ్రఫీ’!!

Posted By: Prashanth

నికాన్‌తో ‘రఫ్ అండ్ టఫ్ ఫోటోగ్రఫీ’!!

 

ప్రతికూల వాతవరణాల్లో సైతం అత్యుత్తమ పరితీరును కనబరిచే రగ్గడ్ జలనిరోధిత ( రగ్గడ్ వాటర్ ప్రూఫ్) కెమెరాను నికాన్ డిజైన్ చేసింది. ప్రక్ళతి సోయగాలను సహజసిద్ధమైన అనుభూతితో ఈ డివైజ్ పదిలపరుస్తుంది. వన్యప్రాణి (వైల్డ్ లైఫ్) ఫోటోగ్రఫీకి నికాన్ రూపొందించిన ఈ వాటర్ ప్రూఫ్ కెమెరా పూర్తి అనుగుణంగా ఉంటుంది.

‘నికాన్ AW 100’ ముఖ్య విశేషాలు:

* ఆకర్షణీయమైన బోల్డ్ కలర్ స్కీమ్,

* రగ్గడ్ డిజైన్,

* జలనిరోధిత కవచం (10 మీటర్ల వరకు),

* ఫ్రీజ్ ప్రూఫింగ్,

* 16 మెగాపిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్,

* 5X ఆప్టికల్ జూమ్,

* 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్,

* 3 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్.

ఆరెంజ్, బ్లూ, స్టాండర్డ్ బ్లాక్ కలర్ స్కీమ్‌లలో ఈ కెమెరా డిజైన్ కాబడింది. డివైజ్ బటన్స్‌ను ధ్ళడమైన మెటీరియల్‌తో రూపొందించారు. ఏర్పాటు చేసిన షాక్ ప్రూఫ్ వ్యవస్థ కెమెరా 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినప్పటికి నష్టం వాటిల్లకుండా చూస్తుంది. పొందుపరిచిన ఫ్రీజ్ ప్రూఫ్ వ్యవస్థ - 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం కెమెరా పనిచేసే విధంగా తోడ్పడుతుంది.

ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్ సౌలభ్యతతో నాణ్యతతో కూడిన చిత్రాలను యూజర్ పొందవచ్చు. 5 X ఆప్టికల్ జూమ్ సుదూర విషయాలను దగ్గరగా చూపిస్తుంది. ఈ డివైజ్ ద్వారా వీడియోలను 1080 పిక్సల్ నాణ్యతతో రికార్డ్ చేసకోవచ్చు. కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ ఫోటో యాంగిల్‌ను స్ఫష్టం చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘నికాన్ AW 100’ కెమెరా ధర రూ.26,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot