దూసుకుపోవాలంటే ఇదే ఛాన్స్!!

Posted By: Super

దూసుకుపోవాలంటే ఇదే ఛాన్స్!!

 

డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల వ్యాపారానికి అనువుగా ఉండే ఇండియన్ గ్యాడ్జెట్ మార్కెట్లో ప్రముఖ కెమెరాల తయారీ సంస్ధ నికాన్ మూడు సరికొత్త డిఎస్ఎల్‌ఆర్ కెమెరాలను విడుదల చేసేందుకు కసరత్తులు పూర్తి చేసింది. నికాన్ డీ4, డీ800, డీ800Eలో రూపుదిద్దుకున్న ఈ ఫోటోగ్రఫీ యంత్రాలు ఉన్నతమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటాయి.

నికాన్ డి4:

ఫ్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు ఈ కెమెరా ఉత్తమ ఎంపిక. ఎఫ్ఎక్స్ - ఫార్మాట్ కెమెరాల సీరీస్ నుంచి వస్తున్న ఈ డివైజ్ 16.2 మెగా పిక్సల్ FX CMOS సెన్సార్‌ను కలిగి ఉంటుంది. పొందుపరిచిన EXPEED 3 ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ కెమెరా పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. సెకనుకు 10 ఫ్రేమ్‌ల వేగంతో ఫోటోలను తీసుకోవచ్చు.

ఏర్పాటు చేసిన 91,000 మెగా పిక్సల్ 3డి కలర్ మ్యాట్రిక్స్ మీటర్ అదే విధంగా ISO అప్లికేషన్‌లు (శ్రేణి 100 to 2,04,800) లైటింగ్ పరిస్థితులతో నిమిత్తం లేకుండా నాణ్యతతో కూడిన ఛాయాచిత్రాలను అందిస్తుంది. ధర రూ.3,25,000.

నికాన్ డీ800:

ఈ కెమెరా రిసల్యూషన్ ( 36.3 మిలియన్ల పిక్సల్స్), డివైజ్‌లో ఏర్పాటు చేసిన EXPEED 3 image ప్రాసెసింగ్ ఇంజన్ వేగవంతమైన పనితీరుకు తోడ్పడుతుంది. అమర్చిన 91K పిక్సల్ RGB సెన్సార్ పూర్తి స్థాయి సీన్ రికగ్నిషన్ టెక్నాలజీని ఒదిగి ఉంటుంది. ధర రూ1,50,000.

నికాన్ డీ800ఇ:

డీ800 మరో వేరియంటే డీ800E. ఈ కెమెరాను ప్రత్యేకించి ఫ్రోఫెషనల్ స్టూడియో ఫోటోగ్రఫీ మరియు ల్యాండ్స్కేప్(భూభాగ) ఫోటోగ్రఫీ అవసరాల కోసం రూపొందించారు. ధర రూ.1,65,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot