‘నికాన్ డి4’.. ప్రొఫెషనల్ డిఎస్ఎల్ఆర్ కెమెరా!!!

Posted By: Prashanth

‘నికాన్ డి4’.. ప్రొఫెషనల్ డిఎస్ఎల్ఆర్ కెమెరా!!!

 

ఈ పక్రటన నికాన్ వినియోగదారులకు అదే విధంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లకు మరింత లబ్ధి చేకూరుస్తుంది. నికాన్ ‘డి3’ వర్షన్‌కి వారుసుడిగా నికాడ్ ‘డి4’ డిఎస్ఎల్ఆర్ కెమెరా రాబోతుంది. ఈ వృత్తిపరమైన కెమెరా తగినంత బరువును మాత్రమే కలిగి మన్నికైనదిగా ఉంటుంది.

ఉత్తమ లక్షణాలను ఒదిగి ఉన్న ఈ ప్రొఫెషినల్ స్ధాయి కెమెరా సెకనుకు 10 ఫ్రేమ్స్ రేటింగ్‌తో ఫోటోలను చిత్రీకరిస్తుంది. 1080p సామర్ధ్యం గల క్వాలిటీ వీడియో రికార్డింగ్ సౌలభ్యతను ఈ డివైజ్‌లో కల్పించారు. షూట్ చేసిన కంటెంట్ అమర్చిన CF లేదా XQD మెమరీ కార్డ్‌లో పదిలంగా సేవ్ కాబడి ఉంటుంది.

‘డి4’ముఖ్య ఫీచర్లు:

* 16.1 మెగా పిక్సల్ రిసల్యూషన్‌తో CMOS సెన్సార్, * FX ఫార్మాట్ డ్రైవ్, * 91,000 పిక్సల్ 3డి మ్యాట్రిక్స్ మీటరింగ్ సిస్టం, * క్వాలిటీ ఎల్‌సీడీ స్ర్కీన్, * కెమెరా శరీరాకృతిని మెగ్నిషీయం దాతువుతో నిర్మించారు

ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కలలను ‘నికాన్ డి4’ పూర్తి స్థాయిలో నెరవేరుస్తుంది. ఈ ఉత్తమ గ్యాడ్జెట్ ఇండియన్ మార్కెట్ ధర అక్షరాలా మూడు లక్షలు. ఈ ధర ఫ్యామిలీ కార్ కన్నా అధికమైంది. ఉత్తమమైన కెమెరా కోసం ఎదరుచూస్తున్న వారికి ‘నికాన్ డి4 డిఎస్ఎల్ఆర్’ ది బెస్ట్!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot