బీభత్సమైన క్లారిటీ!

Posted By: Prashanth

బీభత్సమైన క్లారిటీ!

 

డిఎస్ఎల్ఆర్ శ్రేణి నుంచి మరో మధ్య స్థాయి కెమెరాను నికాన్ పరిచయం చేసింది. పేరు నికాన్ డీ5100. ఉత్తమమైన ఫోటోగ్రఫీ స్పెసిఫికేషన్‌లతో ధృడంగా రూపుదిద్దుకున్న ఈ డివైజ్ సర్వత్రా ప్రశంసలందుకుంటుంది. ఈ గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేసిన 1080p చిత్రీకరణ సామర్ధ్యాన్ని కీలకమైన స్పెసిఫికేషన్‌గా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. కెమెరాలో ఒదిగి ఉన్న మన్నికైన రిసల్యూషన్, పటిష్టమైన ప్రాసెసింగ్ పవర్, బుల్ట్ ఇన్ ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ వంటి అంశాలు అంతిమంగా ఉత్తమ క్వాలిటీ చిత్రాలను విడుదల చేస్తాయి.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

16.2 మెగాపిక్సల్ సామర్ధ్యం (రిసల్యూషన్ 4928 x 3264పిక్సల్స్), ఇమేజ్ నిష్ఫత్తి 3:2,95శాతం వ్యూఫైండర్ కవరేజ్, సీఎమ్‌వోఎస్ సెన్సార్, Expeed 2 ప్రాసెసర్, టీఎఫ్‌టీ ఎల్‌సీడీ మానిటర్, గరిష్ట షట్టర్ స్పీడ్ సెకనుకు 1/4000, కనిష్ట షట్టర్ స్పీడ్ సెకనుకు 30, బుల్ట్‌ఇన్ ఫ్లాష్, ఫ్లాష్ పరిమితి 12m,యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎష్ ఫెసిలిటీ, సెల్ఫ్ క్లీనింగ్ సెన్సార్ యూనిట్, ఆప్టికల్ సెన్సార్, సెన్సార్ డస్ట్ రిడక్షన్, ఎయిర్ ఫ్లో కంట్రోల్ సిస్టం, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్, పాప్-అప్ ఫ్లాష్, నికాన్ EN-EL14 బ్యాటరీ.

డిజిటల్ ఇమేజ్ రోటేషన్, డిస్‌ప్లే బ్రైటె‌నెస్ కంట్రోల్, ఇన్-కెమెరా రెడ్ ఐ రిమూవల్ వంటి అదనపు ఫీచర్లు డివైజ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. మరో వ్యవస్థ డస్ట్ డిలీట్ డేటా సిస్టం, లెన్స్‌‌లో పేరుకున్న ధూళికణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఈ కెమెరా ద్వారా ఫ్లెక్సిబుల్ ఆడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. ఫోటోను రిసైజ్, క్రాప్ చేసుకునే విధంగా ఎడిటింగ్ టూల్స్‌ ఉంటాయి. యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన ఈ గ్యాడ్జెట్‌ను సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు. డివైజ్‌లో ముందుగాన నిక్షిప్తం చేసిన ‘హెల్ప్ గైడ్’ లెర్నర్లకు మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ధర రూ.35,000 నుంచి 40,000 మధ్య ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot