నికాన్ కూల్‌పిక్స్ సొగసరి ఫీచర్లతో!!!

Posted By: Staff

నికాన్ కూల్‌పిక్స్ సొగసరి ఫీచర్లతో!!!

 

గత కొన్ని సంవత్సరాల కాలంగా మన్నికతో కూడిన ఫీచర్ రిచ్ కెమెరాలను ఉత్పత్తి చేస్తున్న నికాన్ తాజాగా తనకు అచ్చొచ్చిన కూల్‌పిక్స్ సిరీస్ నుంచి మరో మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ కెమెరాల బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నికాన్ ‘కూల్‌పిక్స్ ఎస్2600 వేరియంట్’తో మరోసారి ముందుకు రానుంది. అందమైన డిజైన్‌తో ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ బ్లాక్, సిల్వర్, పింక్, రెడ్, బ్లూ, పర్పిల్ కరల్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

కూల్‌పిక్స్ ఎస్2600 ఫీచర్లు:

* 5X జూమ్ నిక్కార్ లెన్స్ (NIKKOR lens),

* వైడ్ యాంగిల్ కవరేజ్,

* సొగసరి కాంపాక్ట్ డిజైన్,

* 19.4మి.మి మందం,

* 14 మెగా పిక్సల్ రిసల్యూషన్,

* ఆటోమెటిక్ సీన్ ఎంపిక,

* నికాస్ ఎక్స్పీడ్ C2 ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్,

* ఎలక్ర్టానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్,

* ఆటో నాయిస్ రిడక్షన్,

* లితియమ్ ఐయాన్ రిఛార్జబుల్ బ్యాటరీ.

ఈ కెమెరా ద్వారా వీడియోలను హై డెఫినిషన్ నాణ్యతతో చిత్రీకరించుకోవచ్చు. సౌండ్ రికార్డింగ్ ఫీచర్లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. పొందుపరిచిన వీఆర్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వ్యవస్థ ఫోటోలను బ్లర్ కాకుండా చూస్తుంది. స్మైల్ టైమర్, స్కిన్ సాఫ్ట్‌నర్, బ్లింక్ ప్రూఫ్ వంటి సెట్టింగ్‌లు శ్రోతకు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. ఇండియన్ మార్కెట్లో ‘నికాన్ కూల్‌పిక్స్ S2600’ కెమెరా ధర త్వరలోనే వెల్లడవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting