నికాన్ కొత్త లాంఛ్..?

Posted By: Staff

నికాన్ కొత్త లాంఛ్..?

 

2012ను ప్రతిష్టాత్మకంగా భావించిన కెమెరాల తయారీ దిగ్గజం నికాన్ ‘గ్రేడ్ డి4’, ‘డి800’ డిఎస్ఎల్‌ఆర్ కెమెరాలను రూపొందించనుంది. ఈ అంశానికి సంబంధించి సంస్థ జనరల్ మేనేజర్ నొబూకీ ససాగకీ స్పందిస్తూ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ లక్షణాలతో కూడిన డిఎస్ఎల్ఆర్ కెమెరాలను ఈ ఏడాది ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలపారు. అయితే విడుదలకు సంబంధించి ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. తాము విడుదల చేయుబోతున్న కొత్త కెమెరాలు ఫోటోగ్రాఫర్ ప్రొఫెషనల్ అవసరాలను పూరిపూర్ణంగా తీరుస్తాయని వెల్లడించారు.

అనువైన ఫోటోగ్రఫీ ఫీచర్లతో రూపుదిద్దుకుంటున్న డి4 కెమెరా ప్రధానంగా  నాయిస్ కంట్రోల్ వ్యవస్థను కలిగి ఉంటుంది. పొందుపరిచిన ఉన్నతమైన ISO టెక్నాలజీ ఫోటోలను బ్లర్ కాకుండా క్యాప్చుర్ చేస్తుంది. తక్కువ వెలుతురులో సైతం క్వాలిటీ ఫోటోగ్రఫీకి ఈ కెమెరా తోడ్పడుతుంది. డి7000కు కొనసాగింపుగా D800 డిఎస్ఎల్ఆర్ కెమెరాను డిజైన్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot