ఇబ్బందికర వాతావరణంలో సైతం..?

Posted By: Super

ఇబ్బందికర వాతావరణంలో సైతం..?

ప్రతికూల వాతవరణాలను ధీటుగా ఎదుర్కొని ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీనందించే డిజిటల్ కెమెరాను ఒలింపస్ సంస్థ డిజైన్ చేసింది. వర్షం..ముంచు..దుమ్ము తదితర విపత్కర పరిస్ధితులను ఈ డివైజ్ సమర్దవంతంగా తట్టుకుంటుంది. షాక్ ప్రూఫ్ వ్యవస్థ కెమెరాను పూర్తిస్థాయిలో కప్పి ఉండటంతో 10 అడుగులు లోతైన నీటిలోకి జారిపిడినప్పటికి చెక్కు చెదరకుండా పని చేస్తుంది. ‘టఫ్ టీజీ-320’ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ ఫోటోగ్రఫీ డివైజ్, మీ ఆనందాలను కలకాలం పదిలపరుచుతుంది.

ముఖ్య ఫీచర్లు:

* 14 మెగా పిక్సల్ సీసీడీ సెన్సార్ వ్యవస్ధ చిత్రాలను హై రిసల్యూషన్ తో బంధిస్తుంది,

* 720 పిక్సల్ హై డెఫినిషన్ క్వాలిటీతో వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు,

* 2.7 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,

* బుల్ట్ ఇన్ ఫ్లాష్ సపోర్ట్,

* ఆప్టికల్ జూమ్ సామర్ధ్యం 3.6x,

* కెమెరాను హైడెఫినిషన్ స్ర్కీన్ లకు అనుసంధానం చేసుకునేందకు గాను హెచ్డీఎమ్ఐ పోర్ట్,

* 28-102ఎమ్ఎమ్ ఈక్విలెంట్ లెన్స్,

* శక్తివంతమైన షాక్ ప్రూఫ్ వ్యవస్థ,

* తక్కువ బరవు,

* యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్,

ఇండియన్ మార్కెట్లో ‘ఒలింపస్ టఫ్ టీజీ-320’డిజిటల్ కెమెరా ధర రూ.9,000 (అంచనా మాత్రమే). బ్లూ, రెడ్ కలర్ వేరియంట్‌లలో మాత్రమే ఈ కెమెరాలు లభ్యం కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot