మాస్‌లో... క్లాస్ ఫోటోగ్రఫీ!

ప్రతికూల వాతవరణాలను సైతం ధీటుగా ఎదుర్కొని ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీనందించే డిజిటల్ కెమెరాను ఒలింపస్ సంస్థ డిజైన్ చేసింది. వర్షం..ముంచు..దుమ్ము తదితర విపత్కర పరిస్ధితులను ఈ డివైజ్ సమర్దవంతంగా తట్టుకుంటుంది. షాక్ ప్రూఫ్ వ్యవస్థ, కెమెరాను పూర్తిస్థాయిలో కప్పి ఉండటంతో 10 అడుగులు లోతైన నీటిలోకి జారిపిడినప్పటికి చెక్కు చెదరకుండా పని చేస్తుంది. ‘టఫ్ టీజీ-320’ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ ఫోటోగ్రఫీ డివైజ్, మీ ఆనందాలను కలకాలం పదిలపరుచుతుంది.
ముఖ్య ఫీచర్లు:
* 14 మెగా పిక్సల్ సీసీడీ సెన్సార్ వ్యవస్ధ చిత్రాలను హై రిసల్యూషన్ తో బంధిస్తుంది,
* 720 పిక్సల్ హై డెఫినిషన్ క్వాలిటీతో వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు,
* 2.7 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,
* బుల్ట్ ఇన్ ఫ్లాష్ సపోర్ట్,
* ఆప్టికల్ జూమ్ సామర్ధ్యం 3.6x,
* కెమెరాను హైడెఫినిషన్ స్ర్కీన్ లకు అనుసంధానం చేసుకునేందకు గాను హెచ్డీఎమ్ఐ పోర్ట్,
* 28-102ఎమ్ఎమ్ ఈక్విలెంట్ లెన్స్,
* శక్తివంతమైన షాక్ ప్రూఫ్ వ్యవస్థ,
* తక్కువ బరవు,
* యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్,
ఇండియన్ మార్కెట్లో ‘ఒలింపస్ టఫ్ టీజీ-320’డిజిటల్ కెమెరా ధర రూ.9,000 (అంచనా మాత్రమే). బ్లూ, రెడ్ కలర్ వేరియంట్‌లలో మాత్రమే ఈ కెమెరాలు లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








