ప్యానసానిక్ నూతన శ్రేణి డిజిటల్ కెమెరా..!!

Posted By: Super

ప్యానసానిక్ నూతన శ్రేణి డిజిటల్ కెమెరా..!!

 

డిజిటల్ ఫోటోగ్రఫీ కొత్త పంతుల తొక్కుతున్న నేపధ్యంలో ప్యానసానిక్ కొత్త శ్రేణి డిజిటల్ కెమెరాను లాంఛ్ చేసింది. ‘లూమిక్స్ ZS20’ నమూనాలో రూపుదిద్దుకున్న ఈ పలుచటి కెమెరా సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీకి తోడ్పడుతుంది. ఈ కెమెరా ఆప్టికల్ జూమ్ ఎంతో తెలుసా..? అక్షరాలా 20X... ఇతర ఫీచర్ల వివరాలు:

* అత్యధిక సూక్ష్మ గ్రాహ్యత కలిగిన 14 మెగా పిక్సల్ ఎమ్‌వోఎస్ సెన్సార్,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 20X ఆప్టికల్ జూమ్,

* హై స్పీడ్ ఫోటోగ్రఫీ వ్యవస్థ,

* మెరుగైన జీపీఎస్ వ్యవస్థ,

* ఐఎస్‌వో శ్రేణి 3200,

* లైట్ స్పీడ్ ఆటో ఫోకస్,

* నాయిస్ క్యాన్సిలింగ్ స్టీరియో మైక్రో ఫోన్,

* 3 అంగుళాల టచ్ స్ర్కీన్ LCD డిస్ ప్లే.

ఆకర్షణీయమైన శైలిలో అత్యాధునిక ఫోటోగ్రఫీ పీచర్లను ఒదిగి ఉన్న ఈ కెమెరా మీ జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చెక్కుచెదరకుండా పదిలపరుస్తుంది. వీడియోలను హై డెఫినిషన్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రయాణ సందర్భాల్లో ఈ కెమెరా ద్వారా మరింత లబ్ధి పొందవచ్చు. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot