పోలరాయిడ్ స్మార్ట్ కెమెరా... పక్కా ప్రొఫెషనల్!!!

Posted By: Staff

పోలరాయిడ్ స్మార్ట్ కెమెరా... పక్కా ప్రొఫెషనల్!!!

 

అంతర్జాతీయ కెమెరాల ఉత్పత్తిదారు పోలరాయిడ్ తమ నూతన ఉత్పత్తులకు సంబంధించి అధికారిక ప్రకటనను  వెలవరించింది. పోలరాయిడ్ sc1630  మోడల్‌లో  ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ కెమెరాను ప్రవేశపెడుతున్నట్లు బ్రాండ్ వర్గాలు స్పష్టం చేశాయి. స్మార్ట్ ఫోన్, స్టిల్ కెమెరాల లక్షణాలను ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చి ఈ డివైజ్‌ను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు ఉటంకించాయి.

కెమెరా రిసల్యూషన్ 16 మెగా పిక్సల్ కలిగి మన్నికైన ఫోటోలను ఉత్పత్తి చేస్తుంది.  పొందుపరిచిన 3x ఆప్టికల్ జూమ్ దూరంగా ఉన్ణ ఫోటోలను సైతం క్లారిటీతో బంధిస్తుంది.  ఏర్పాటు చేసిన 3.2 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే ఫోటో ఎంపిక విషయంలో  ఖచ్చితమైన క్లారిటీని మీకు ఇస్తుంది.   నిక్షిప్తం చేసిన వై-ఫై వ్యవస్థను ఇంటర్నెట్‌కు కనెక్టు చేరసుకోవచ్చు.

ఈ ప్రక్రియ ద్వారా మీకు నచ్చిన ఫోటోను నేరుగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల‌లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు.  కెమెరాలో దోహదం చేసిన బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్ వ్యవస్థలు డేటా షేరింగ్‌కు దోహదపడతాయి.  డివైజ్‌లో బలోపేతం చేసిన ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సులువైన పనితనంతో వినియోగదారుడిని యూజర్ ఫ్రెండ్లీ అనుభూతిని కలిగిస్తుంది. తీసిన ఫోటోలను కెమెరాలోనే ఎడిట్ చేసుకోవచ్చు.

కెమెరా బరువు దాదాపు 2.3 కిలోగ్రాములు ఉంటుంది. జియో ట్యాగింగ్ ఫీచర్లను గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ వ్యవస్థ ఫోటో తీసిన సమాయన్ని, ప్రాంతాన్ని నమోదు చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో పోలరాయిడ్ SC1630 ధర త్వరలోనే వెల్లడవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot