ఎక్కడ చూసినా అదే దూకుడు!!

Posted By: Super

 ఎక్కడ చూసినా  అదే దూకుడు!!

 

స్మార్ట్‌ఫోన్స్ అదేవిధంగా  టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ విభాగంలో ప్రముఖంగా వినబడుతున్న పేరు శామ్‌సంగ్.. చాపకింద నీరులా ఈ బ్రాండ్ ఉత్పత్తులు వ్యాప్తిచెందుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ బ్రాండ్ హై క్వాలిటీ మీడియా ప్లేయర్లను వినియోగదారులకు అందించింది. నికాన్, కానన్, సోనీ, ఫుజి ఫిల్మ్ వంటి దిగ్గాజ కెమెరా తయారీ సంస్థలతో సైతం శామ్‌సంగ్ పోటీపడుతుంది. తాజాగా శామ్‌సంగ్ తక్కువ బరువుతో కూడిన  హై ఎండ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. పేరు శామ్‌సంగ్ 1000NX.ఈ  డిజిటల్ కామ్‌లోని కీలకాంశం వై-ఫై సపోర్ట్,  ఈ సౌలభ్యత ఆధారితంగా ఫోటోలను నేరుగా ఇతర డివైజుల్లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు.

కెమెరాలోని పలు కీలక ఫీచర్లు:

- 100ms ఆటోఫోకస్,

- 20.3 మెగా పిక్సల్ ఏపీఎస్-సీ సీఎమ్‌వోఎస్ సెన్సార్,

-    20-50ఎమ్ఎమ్ లెన్స్,

- 3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,

-    బరువు 359 గ్రాములు,

- 640 X 480పిక్సల్ రిసల్యూషన్,

-    ఎక్సటర్నల్ ఫ్లాష్,

-    హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

-    హాట్ షూ ఆడాప్టర్,

-    స్మార్ట్ ఫిల్టర్స్,

-    వై-ఫై కనెక్టువిటీ.

కేవలం 350 గ్రాములు బరువు కలిగిన ఈ కెమెరా ప్రయాణ సందర్భాల్లో పూర్తి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ పాకెట్ సైజ్ డివైజ్ భిన్నమైన వైబ్రెంట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఉత్తమ క్వాలిటీ స్టాండర్డ్ బటన్లను కెమెరాలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వై-ఫై టెక్నాలజీ సాయంతో ఫోటోలను నేరుగా మీ హ్యాండ్‌సెట్‌లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. 3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ క్లారిటీతో కూడిన విజువల్స్‌ను అందిస్తుంది. రిమోట్ వ్యూఫైండర్ అప్లికేషన్ సాయంతో కెమెరాను రిమోట్ కంట్రోల్ ఆధారితంగా ఆపరేట్ చేసుకోవచ్చు. సిఎమ్ఒఎస్ సెన్సార్ అదేవిధంగా లెన్స్ వ్యవస్థలు ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి.

జూన్ నాటికి ఈ కెమెరా అందుబాటులోకి రానుంది. ధర  అంచనా రూ.35,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot