ఆండ్రాయిడ్ కెమెరా వార్.... సామ్‌సంగ్ vs నికాన్!

Posted By: Prashanth

ఆండ్రాయిడ్ కెమెరా వార్.... సామ్‌సంగ్ vs నికాన్!

 

ఆండ్రాయిడ్ కెమెరాల మార్కెట్ ఊపందుకుంటోంది. ఈ వోఎస్ ఆధారితంగా స్పందించే కెమెరాలు స్మార్ట్‌ఫోన్ తరహాలోనే వివిధ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తాయి. సామ్‌సంగ్ అదేవిధంగా నికాన్‌లు ఆండ్రాయిడ్ ఆధారిత కెమెరాలను ఇటీవల కాలంలో ఆవిష్కరించాయి. వీటి స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.

సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా:

ఈ కెమెరా ఆండ్రాయిడ్ లేటెస్డ్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ పై స్పందిస్తుంది. నవంబర్ మధ్య నాటికి భారత్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇతర ఫీచర్లు:

4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ క్లియర్ ఎల్‌సీడీ స్ర్కీన్(రిసల్యూషన్ 1280 x 720),

1.4గిగాహెడ్జ్ ప్రాసెసర్,

16 మెగా పిక్సల్ కెమెరా (21ఎక్స్ ఆప్టికల్ జూమ్),

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,

1650లియోన్ బ్యాటరీ.

అనుకూలమైన అంశాలు:

- ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

- చిత్రీకరించిన ఫోటోలను వేగవంతంగా రివ్యూ చేసుకునే సౌలభ్యత,

- సుదూరమైన ఆప్లికల్ జూమ్, పెద్దదైన స్ర్కీన్ ఇంకా 3జీ కనెక్టువిటీ

- ఫోటో చిత్రీకరణకు ముందే విజువల్ ఫీడ్ బ్యాక్,

- ఫిల్మ్‌స్ట్రిప్ మోడ్.

- సింగిల్ ట్యాప్ ద్వారా ఫోటోలను డిలీట్ చేసుకనే సౌలభ్యత.

ప్రతికూల అంశాలు:

- అధిక దర,

- నెమ్మదైన జూమ్ ఇతర కెమరాలతో పోలిస్తే.

నికాన్ కూల్‌పిక్స్ ఎస్800సీ:

నికాన్ కూల్‌పిక్స్ ఎస్800సీ కెమెరాల పరిశ్రమకు మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఆధారిత కెమెరాగా పరిచయమైంది. ఇండియన్ మార్కెట్లో ధర రూ.20,950.

ఫీచర్లు:

3.5 అంగుళాల ఓఎల్ఈడి టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

2జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

512ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

16 మెగా పిక్సల్ బీఎస్ఐ సీఎమ్‌వోఎస్ సెన్సార్ (10ఎక్స్ ఆప్టికల్ జూమ్),

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

వై-ఫై,

బ్లూటూత్,

జీపీఎస్,

1050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

అనుకూల అంశాలు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

స్థిరత్వం,

ఇన్-బుల్ట్ వై-ఫై, (గూగుల్ ప్లే స్టోర్‌కు కనెక్ట్ చేసుకునేందుకు),

వేగవంతంగా స్పందించే టచ్‌ఇంటర్ ఫేస్,

ఉత్తమ ఇమేజ్ క్వాలిటీ,

తక్కువ బరువు,

ఆకట్టుకునే కలర్స్.

ప్రతికూల అంశాలు:

తక్కువ బ్యాటరీ లైఫ్,

పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టం,

తీర్పు:

ఈ రెండు కెమెరాలు గూగుల్ ప్లేస్టోర్‌ను సపోర్ట్ చేస్తాయి. వీటి హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ ఫీచర్ల విషయంలో తేడాలను గమనించవచ్చు. సామ్‌సంగ్ కెమెరా విషయానికొస్తే పెద్దదైన హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలను ప్రధాన ప్రత్యేకతలుగా భావించవచ్చు. ఆండ్రాయిడ్ బీమ్, ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, ప్రాజెక్ట్ బట్టర్ వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు జెల్లీబీన్ వోఎస్‌లో ఒదిగి ఉన్నాయి. మరో వైపు నికాన్ కెమెరా పాత వర్షన్ ఆండ్రాయిడ్ వోఎస్ పై రన్ అవుతుంది. పెద్దదైన డిస్‌ప్లే, మన్నికైన బ్యాటరీ బ్యాకప్ ఇంకా మెరుగైన ఆప్టికల్ జూమ్ కావాలనుకునే వారికి గెలాక్సీ కెమెరా ఉత్తమ ఎంపిక. తక్కువ బరువు అదేవిధంగా సైజ్ ఇంకా యూజబులిటీని కోరుకునే వారికి నికాన్ కూల్ పిక్స్ ఎస్800సీ బెస్ట్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot