సులువైన ఫోటోగ్రఫీ కోసం శామ్‌సంగ్ MV800

టెలివిజన్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ఉత్పాదక రంగాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న శామ్‌సంగ్ ఇటీవల కాలంలో డిజిటల్ కెమెరాల ఉత్పత్తి పై ద్ళష్టిసారించింది. ఫోటోగ్రఫీ పై పట్టులేని వారు సైతం ఈ కెమెరాను సులువుగా ఆపరేట్ చేయ్యవచ్చు. ఈ డివైజ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లిప్-ఔట్ డిస్‌ప్లే వ్యవస్థ దాదాపు అన్ని కోణాలలోని చిత్రాలను ఉత్తమ క్వాలిటితో క్యాప్చర్ చేస్తుంది. అన్ని రకాలైన వినియోగదారులను ఆకర్షించేవిధంగా ఉన్నతమైన ఫీచర్లను ఈ కెమెరాలో నిక్షిప్తం చేశారు.
శామ్‌సంగ్ MV800 ముఖ్య ఫీచర్లు:
*16.15 మెగా పిక్సల్ రిసల్యూషన్, * సీసీడీ సెన్సార్, * 5x ఆప్టికల్ జూమ్, * 10ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, * డ్యూయల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, * స్మార్ట్ ఆటో ఫీచర్, * స్మార్ట్ ఆల్బమ్ వ్యవస్థ, * స్మార్ట్ ఫేస్ రికగ్నిషన్, * స్మార్ట్ మూవీ అప్లికేషన్, * 10 ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, * స్టీరియో మైక్రో ఫోన్, * మోనో స్పీకర్ వ్యవస్ధ, * హెచ్డీఎమ్ఐ సపోర్ట్, * యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, * ఇంటెల్లీ స్టూడియో సాఫ్ట్‌వేర్ వ్యవస్థ.
నాజూకైన శ్రేణిలో ఈ కెమెరా డిజైన్ కాబడింది. ఏర్పాటు చేసిన హోమ్, ప్లేబ్యాక్ బటన్ వ్యవస్థలు సులువైన ఆపరేటింగ్‌కు దోహదపడతాయి. టచ్ స్ర్కీన్ వ్యవస్థ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వ్యవస్థ సౌలభ్యతతో వినియోగదారుడు సీన్ మోడ్‌లను సులువుగా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియోలను హై డెఫినిషన్ క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. సుదీర్ఘమైన బ్యాకప్‌నిచ్చే BP70A బ్యాటరీని కెమెరాలో ఏర్పాటు చేశారు. ఇండియన్ మార్కెట్లో శామ్‌సంగ్ MV800 విలువ రూ.15,000.


Click it and Unblock the Notifications








