సామ్‌సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ కెమెరా

Posted By:

‘ఎన్ఎక్స్ మినీ'(NX Mini) పేరుతో సరికొత్త స్మార్ట్ కెమెరాను, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ బుధవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. నాజూకైన డిజైనింగ్‌తో పాటు తేలికైన ఇంటర్ చేంజబుల్ లెన్స్‌ను కలిగి ఉన్న ఈ కెమెరాను ప్రముఖ రిటైలర్ amazon.in రూ.22,990కి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. కొనుగోలు పై రూ.1999 విలువ చేసే బ్యాక్ ప్యాక్‌ను అమెజాన్ ఉచితంగా ఇస్తోంది.16 జీబి మెమరీ కార్డ్‌తో లభ్యమవుతోన్న సామ్‌సంగ్ ఎన్ఎక్స్ మినీ స్మార్ట్ కెమెరా ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

 సామ్‌సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ కెమెరా

కెమెరా మందం 22.5 మిల్లీమీటర్లు, బరువు 158 గ్రాములు.
స్టైలిష్ డిజైన్, ఆకట్టుకునే ఇమేజ్ క్వాలిటీ,
9ఎమ్ఎమ్ ఎఫ్3.4 ఈడీ లెన్స్,
1" 20.5 మెగా పిక్సల్ బీఎస్ఐ సీఎమ్ఎస్ సెన్సార్ (క్రిస్టల్ క్లియర్ రిసల్యూషన్‌తో),
1080పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీ వీడియో రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

కెమెరాలో నిక్షిప్తం చేసిన స్మార్ట్ ఫీచర్లు (సోషల్ మీడియా అప్‌లోడ్, ఈమెయిల్, ఫోటో బీమ్, డైరెక్ట్ లింక్, మొబైల్ లింక్, పీసీ ఆటో - బ్యాకప్, రిమోట్వ్యూఫైండర్ పీఆర్ఓ, ఆల్ షేర్, బేబీ మానిటరింగ్), కెమెరాతో పాటు 9ఎమ్ఎమ్ లెన్స్, బీ740ఏయూ బ్యాటరీ, మైక్రోయూఎస్బీ కేబుల్, అడాప్టర్, హ్యాండ్ స్ట్రాప్, అడోబ్ ఫోటోషాప్ లైట్ రూమ్ 5, సామ్‌సంగ్ సాఫ్ట్‌‍వేర్ సీడీ, క్విక్ స్టార్ట్‌గైడ్, వారంటీ కార్డ్, 16జీబి కార్డ్ అలానే 16 జీబి మెమరీ కార్డ్‌ను కొనుగోలుదారుడు పొందవచ్చు. కెమెరా పై సామ్సంగ్ ఇండియా రెండు సంవత్సరాల వారంటీనిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung New NX Mini Smart Camera Now Available For Rs 22,990. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot