కెమెరా మార్కెట్ పై శామ్‌సంగ్ పంజా!!

Posted By: Super

కెమెరా మార్కెట్ పై శామ్‌సంగ్ పంజా!!

 

స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో అంతర్జాతీయంగా దూసుకుపోతున్న శామ్‌సంగ్ తాజాగా కెమెరా ఉత్పాదక రంగం పై దృష్టి కేంద్రీకరించింది. పలు ఉత్తమ ఫీచర్ల గల కెమెరాలను ఇప్పటికే ఈ గ్యాడ్జెట్ దిగ్గజం ప్రవేశపెట్టింది. పాత మోడల్ ‘NX200’ కెమెరాకు

అప్ డేటెడ్ వర్షన్‌గా ‘న్యూ రెట్రో స్టైల్ NX200’ను శామ్‌సంగ్ డిజైన్ చేసింది. ఉత్తమమైన ఫోటోగ్రఫీని కోరుకునే వారికి ఈ డివైజ్ సరైన ఎంపికగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అత్యాధునిక ఫోటోగ్రఫీ ఫీచర్లను ఈ కెమెరాలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కెమెరాలు సౌత్ కొరియాలో లభ్యమవుతున్నాయి. త్వరలో వీటిని ఇండియాలో విడుదల చేస్తారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

‘న్యూ రెట్రో స్టైల్ NX200’ ముఖ్య ఫీచర్లు:

* కంపాక్ట్ సైజ్,

* 20.3 APS-C సెన్సార్.

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot