మీకు మీరే మాస్టర్!!

Posted By: Prashanth

మీకు మీరే మాస్టర్!!

 

డిజిటల్ మీడియా రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న శామ్‌సంగ్ మరో సారి వార్తల్లో నిలిచింది. శక్తివంతమైన హై వపర్ జూమ్ సామర్ధ్యంతో కూడిన స్మార్ట్ కెమెరాను ఈ దిగ్గజ బ్రాండ్ రూపొందించింది. ఈ కూల్ ఫోటో కెమెరా పేరు శామ్‌సంగ్ ఎస్‌టి200ఎఫ్. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో రాణించాలనుకునే వారికి ఈ డివైజ్ చక్కటి సహవాసం.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

• 16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్, • 10X ఆప్టికల్ జూమ్, • సీసీడి హై రిసల్యూషన్, • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, • వై-ఫై, • 3 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే, • 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, • 27ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్, • రిమోట్ వ్యూ ఫైండర్, • పీసీలోకి ఆటోమెటిక్ సేవింగ్, • ఆటో బ్యాకప్, • లైమ్ పానోరమా,• మోషన్ క్యాప్చుర్,

మీ సృజనాత్మకతకు అనుగుణంగా ఈ కెమెరాను మలచుకోవచ్చు. పొందుపరిచిన ఎడిటింగ్ ఆప్షన్స్ మీ ఫోటోగ్రఫీకి మరింత అందాన్ని అద్దుతాయి. నిక్షిప్తం చేసిన ఆటోమెటిక్ బ్యాకప్ అదే విధంగా అప్‌లోడింగ్ ఆప్షన్లు కెమెరాకు ప్రధాన ఆకర్షణ. ఏర్పాటు చేసిన స్టాండర్డ్ లై-యాన్ బ్యాటరీ కెమెరా బ్యాకప్‌ను మరింత బలపరుస్తుంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ అదే విధంగా టాబ్లెట్ పీసీలకు ఈ కెమెరాను సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్‌లతో పాటు స్పెషల్ అనుభూతులకు లోనేచేసే ఆప్షన్‌లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు.

ఏర్పాటు చేసిన జూమ్ వ్యవస్థ దూరముగా ఉన్న చిత్రాలను మన్నికతో చిత్రీకరిస్తుంది. మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీ సాయంతో ఫోటోలను మరింత సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీరు చిత్రీకరించిన ఫోటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి సలువుగా షేర్ చేసుకోవచ్చు. రిమోట్ వ్యూ ఫైండర్ సాయంతో కెమెరాను వై-ఫై ద్వారా స్మార్ట్ ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. రెడ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లో డివైజ్ లభ్యం కానుంది. ఇండియన్ మార్కెట్లో ధర అంచనా రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot