సోనీ సూపర్ క్లారిటీ సింగిల్ లెన్స్ కెమెరా

Posted By: Staff

సోనీ సూపర్ క్లారిటీ సింగిల్ లెన్స్ కెమెరా

 

ఫోటోగ్రఫీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను కూలంకుషంగా అంచనావేస్తూ సోనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే పలు కెమెరాలను లాంఛ్ చేసిన సోనీ తాజాగా సింగిల్ లెన్స్ ట్రాన్స్‌లూసెంట్ కెమెరాను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది. సోనీ ఎస్ఎల్‌టీ -ఏ57 (Sony SLT –A 57)గా మార్కెట్లోకి రాబోతున్న ఈ డివైజ్ అత్యాధునిక ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. డిఎస్ఎల్‌ఆర్ కెమెరా తరహాలో డిజైన్ కాబడిన ఈ కెమెరా పూర్తి స్థాయి ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీకి అనువుగా తక్కువ బరువు కలిగిన ఈ కెమెరా ఇండియన్ మార్కెట్లో అంచనా విలువ రూ. 40,000. ఏప్రిల్ చివరి నాటికి ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

- 18-55 జూమ్‌లెన్స్ కిట్,

- 16.1 మెగా పిక్సల్ ఏపీఎస్ - సీ సీఎమ్‌వోఎస్ సెన్సార్,

- సెకనకు 60 ఫ్రేముల వేగంతో హై డెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు,

- 3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,

- 2డి/3డి స్వీప్ పనోరమా,

- ఇమేజ్ స్టెబిలైజేషన్,

- ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్,

- మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్టు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot