సోనీ నుంచి మరో సైబర్ షాట్!

Posted By: Prashanth

సోనీ నుంచి మరో సైబర్ షాట్!

 

సోనీ మరో సారి వార్తల్లో నిలిచింది. తన సైబర్ షాట్ సిరీస్ నుంచి HX200V మోడల్‌లో కెమెరాను డిజైన్ చేసింది. సోనీ నుంచి ఇదువరుకే విడుదలైన HX100V కెమెరాకు ఇది సక్సెసర్ అని తెలుస్తోంది. డివైజ్ ప్రధాన ఫీచర్లను పరిశీలిస్తే:

* 18.2 మెగా పిక్సల్, ½.3 అంగుళాల సిఎమ్‌వోఎస్ సెన్సార్,

* బ్యాక్‌లైట్ సెన్సార్ విత్ Exmor R టెక్నాలజీ,

* 30ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్,

* 1080పిక్సల్ హై డెఫినిషన్ మూవీ రికార్డింగ్,

* 920కే డాట్ రిసల్యూషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

* ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్,

* ఇన్‌బుల్ట్ జీపీఎస్ మాడ్యుల్.

సరికొత్త శ్రేణిలో డిజైన్ కాబడిన HX200V పూర్తి స్థాయి ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. డివైజ్‌ను పూర్తి స్థాయి ఆకృతి పట్టు (textured grip)తో కప్పి ఉంచటం వల్ల చేతికి సౌకర్యవంతంగా ఇముడుతుంది. పొందుపరిచిన 18.2 మెగా పిక్సల్, ½.3 అంగుళాల సిఎమ్‌వోఎస్ సెన్సార్ ఉత్తమ క్వాలిటీ ఫోటోలను చిత్రీకరిస్తుంది. ఏర్పాటు చేసిన 30 ఎక్స్ ఆప్టికల్ జూమ్ వ్యవస్థ సూపర్ క్వాలిటీ జూమ్ అదే విధంగా ఉత్తమ శ్రేణి ఫోకస్ కంట్రోలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కెమెరా వెనుక భాగంలో అమర్చిన 920కే డాట్ ఎల్‌సీడి స్ర్కీన్ కీలకమైన ఫోటోలు తీసేసమయంలో ఖచ్చితమైన అవగాహన కల్పిస్తుంది. ఏప్రిల్ నాటికి ఈ కెమెరా మార్కెట్లో లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot