చిన్న కెమెరా..చింతలేని ఫోటోగ్రఫీ

Posted By: Prashanth

చిన్న కెమెరా..చింతలేని ఫోటోగ్రఫీ

 

ఉత్తమ ఫోటోగ్రఫీ ప్రమాణాలతో కూడిన చిన్నసైజ్ డిజిటల్ కెమెరాను సోనీ రూపొందించింది. సైబర్ షాట్ సిరీస్ నుంచి వస్తున్న ఈ కెమెరా మోడల్ ‘సోనీ WX100’. శక్తివంతమైన జూమ్, హెడెఫినిషన్ షూటింగ్ మరియు అత్యాధునిక 3డీ వ్యవస్థలను ఈ ఫోటోగ్రఫీ డివైజ్‌లో నిక్షిప్తంచేశారు.

కెమెరాలో ఏర్పాటు చేసిన కీలక ఫీచర్లు:

* సూపర్ స్లిమ్ డిజైన్, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్, 18.2 మెగా పిక్సల్ Exmor సిఎమ్‌వోఎస్ సెన్సార్, ఇమేజ్ రిసల్యూషన్ (4896×3672పిక్సల్స్), వీడియో రికార్డింగ్ సౌలభ్యత (1920 x 1080పిక్సల్ రిసల్యూషన్‌తో), తక్కువ వెలుతురులో సైతం క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించేందుకు ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ, అనవసర శబ్ధాలను నిరోధించి సూపర్ పవర్ Bionz ప్రాసెసర్, పిక్సల్ సూపర్ రిసల్యూషన్ టెక్నాలజీ, 3డి స్వీప్ పానోరమా మోడ్, 2.7 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, హై స్పీడ్ మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ పోర్టు, కెమెరా బరువు 124 గ్రాములు. ఇండియన్ మార్కెట్లో ఈ కెమెరా విడుదలకు సంబంధించి ప్రస్తుతానికి ఏ విధమైన సమాచారం అందలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot