తియ్యని వేడుక చేసుకోండి!!

Posted By: Prashanth

తియ్యని వేడుక చేసుకోండి!!

 

ఉత్తమ శ్రేణి కెమెరాలు నిర్మాణ సంస్ధ సోనీ అత్యాధునిక సాంకేతికతతో కూడిన హ్యాండి‌క్యామ్‌ను తయారుచేసింది. ఈ మోడల్ నెంబురు HDR-CX190E.తక్కువ బరువు కలిగి ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను రంగరించుకున్న ఈ డివైజ్ అత్యుత్తమ క్వాలిటీలో కూడిన వీడియోలు అదేవిధంగా ఫోటోలును క్యాప్చుర్ చేస్తుంది.

హ్యాండి‌క్యామ్ ప్రధాన ఫీచర్లు:

ఇఎక్స్ఎమ్‌ఆర్ ఆర్ సీఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్, BIONZ ఇమేజ్ ప్రాసెసర్, 5.3 మెగా పిక్సల్ స్టిల్ ఇమేజ్ రిసల్యూషన్, 25x ఆప్టికల్ జూమ్, 30x ఎక్స్‌టెండెడ్ జూమ్, ఫేస్ మరియు స్మైల్ డిటెక్షన్, 2.7 మెగా పిక్సల్ డాట్ ఎల్‌సీడి డిస్‌ప్లే, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ , యూఎస్బీ

క్రమబద్ధమైన హ్యాండ్‌క్యామ్ డిజైన్‌ను అనుసరిస్తూ ఈ క్యామ్‌కార్డర్‌ను వృద్ధి చేశారు. కేవలం 168గ్రాములు బరువు కలిగిన ఈ క్యామ్‌ను సౌకర్యవంతంగా క్యారీ చెయ్యవచ్చు. బ్లాక్ మరియు సిల్వర్ కలర్ కాంబినేషన్‌లో తీర్చిదిద్దారు. నిక్షిప్తం చేసిన ఇఎక్స్ఎమ్‌ఆర్ ఆర్‌ సీఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్ , 5.3 మెగా పిక్సల్ స్టిల్ ఇమేజ్ రిసల్యూషన్, 25x ఆప్టికల్ జూమ్ వ్యవస్థలు ప్రొఫెషనల్ క్వాలిటీ పనితీరును కనబరుస్తాయి. ఈ క్యామ్ ద్వారా మూవింగ్ షాట్‌లను క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. MPEG4-AVC/H.264 ఫార్మాట్‌లో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. స్టిక్ ప్రో డ్యూయో, ప్రో - హెచ్‌జి డ్యూయో, మైక్రోఎస్డీ, ఎస్‌డిఎక్స్‌సి, ఎస్‌డి‌హెచ్‌సీ వంటి మెమరీకార్డులను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.20,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting