సోనీ ‘దిబెస్ట్’!

By Prashanth
|

సోనీ ‘దిబెస్ట్’!

 

ప్రముఖ బ్రాండ్ సోనీ, నీరు ఇంకా దుమ్ము నిరోధక సామర్ధ్యం కలిగిన హ్యాండీక్యామ్‌ను డిజైన్ చేసింది. పేరు హెచ్డీఆర్-జీడబ్ల్యూ77వీ. 16అడుగులు లోతైన నీటిలో పడినప్పటికి క్యామ్ చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. దుమ్మును సైతం ఈ ఫోటోగ్రఫీ డివైజ్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఐదడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరదు. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలు కలిగి ఉన్న ఈ డివైజ్‌ను కొత్త వారు సైతం సులువుగా ఆపరేట్ చెయ్యవచ్చు.

సోనీ HDR-GW77V కీలక ఫీచర్లు:

రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, టచ్‌స్ర్కీన్ ఫెసిలిటీ, 10x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, Exmor R సీఎమ్‌వోఎస్ సెన్సార్, 1080 పిక్సల్ వీడియో కాప్చర్ సామర్ధ్యం, హెచ్‌‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ, 90 నిమిషాల రికార్డింగ్ టైమ్, ఫోకల్ లెంగ్త్ 3.2 నుంచి 32ఎమ్ఎమ్ వరకు, ఎస్డీ‌కార్డ్ సపోర్ట్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి.

క్యామ్‌లో నిక్షిప్తం చేసిన జీపీఎస్ ఫెసిలిటీ జియో ట్యాగింగ్‌తో కూడిన షూటింగ్‌కు ఉఫకరిస్తుంది. బ్లూ, బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ కెమెరాల ధర భారత్ లో రూ.46,000 వరకు ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X