మార్కెట్లోకి సోనీ కెమెరాలు!

Posted By: Prashanth

మార్కెట్లోకి సోనీ కెమెరాలు!

 

విశ్వసనీయ ఫోటో కెమెరాల తయారీ బ్రాండ్ సోనీ మూడు సరికొత్త మోడళ్లలో ఇంటర్ చేంజ్‌బుల్ లెన్స్ కలిగిన కెమెరాలను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆల్పా సీరిస్ నుంచి భిన్న వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న వీటి పేర్లు ఆల్ఫా 77, ఆల్ఫా 65, ఆల్ఫా 57.

ధరలు:

ఆల్ఫా 77: రూ. 69,990,

ఆల్ఫా 65: రూ.59,990,

ఆల్ఫా 57: రూ.45,990.

ఆల్ఫా 77 ప్రత్యేకతలు:

- వేగవంతమైన ఇంటర్‌చేంజ్‌బుల్ లెన్స్ (12 ఫ్రేమ్స్ పర్ సెకన్),

- 19 పాయింట్ ఆటో ఫోకస్ సిస్టం,

- 3 అంగుళాల ఎడ్జస్టబుల్ ఎల్‌సీడీ స్ర్కీన్,

- 24.3 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్.

సోనీ డిజిటల్ కెమెరా DSC-W520:

హై క్వాలిటీ కెమెరాలను డిజైన్ చెయ్యటంలో దిట్టగా గుర్తింపుతెచ్చుకున్న సోనీ మరో డిజిటల్ ఆణిముత్యాన్ని కెమెరా ప్రియులకు అందించనుంది. సోని సైబర్‌షాట్ సిరీస్ నుంచి వస్తున్న ఈ కెమెరా మోడల్ DSC-W520.ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఆధునిక టెక్నాలజీ, ఉన్నతమైన ఫోటోగ్రఫీ విలువలతో పాటు ఉత్తమమైన మల్టీ మీడియా వ్యవస్థను రంగరించుకుని ఉంటుంది. ఈ డివైజ్ యూజర్ ఫోటోగ్రఫీ నైపుణ్యతను పెంపొందిస్తుంది.

కెమెరా ముఖ్య ఫీచర్లు:

25ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్,

5X ఆప్టికల్ జూమ్,

స్వీప్ పానోరమా ఫీచర్,

14.1 మెగా పిక్సల్ రిసల్యూషన్,

క్రిస్టల్ క్లియర్ ఫోటోల కోసం స్టడీ షాట్ ఇమేజ్ స్టెబిలైజేషన్,

ఇంటెలీజెంట్ ఆటో మోడ్,

ధర రూ.5,990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot