నీటిలో పడినా చెక్కుచెదరని హ్యాండీక్యామ్!!

Posted By: Staff

నీటిలో పడినా చెక్కుచెదరని హ్యాండీక్యామ్!!

పోటోకెమెరాల తయారీ సంస్థ  సోనీ మరో ప్రయత్నంగా, నీరు ఇంకా దుమ్ము నిరోధక సామర్ధ్యం కలిగిన హ్యాండీక్యామ్‌ను డిజైన్ చేసింది. పేరు హెచ్డీఆర్-జీడబ్ల్యూ77వీ. ఈ సరికొత్త కెమెరా తొలత జపాన్‌లో  విడుదల కానుంది. 16అడుగులు లోతైన నీటిలో పడినప్పటికి క్యామ్ చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. దుమ్మును సైతం ఈ ఫోటోగ్రఫీ డివైజ్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. పటిష్టమైన శరీరాకృతి కలిగిన ఈ కెమెరా ఐదడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరదు. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలతో ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలు కలిగి ఉన్న ఈ డివైజ్‌ను కొత్త వారు సైతం సులువుగా ఆపరేట్ చెయ్యవచ్చు.

సోనీ HDR-GW77V కీలక ఫీచర్లు:

రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,


టచ్‌స్ర్కీన్ ఫెసిలిటీ,


10x ఆప్టికల్ జూమ్,


120x డిజిటల్ జూమ్,


యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,


Exmor R సీఎమ్‌వోఎస్ సెన్సార్,


1080 పిక్సల్ వీడియో కాప్చర్ సామర్ధ్యం,


హెచ్‌‌డిఎమ్‌ఐ  కనెక్టువిటీ,


90 నిమిషాల రికార్డింగ్ టైమ్,


ఫోకల్ లెంగ్త్ 3.2 నుంచి 32ఎమ్ఎమ్ వరకు,


ఎస్డీ‌కార్డ్ సపోర్ట్,


ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి.

క్యామ్‌లో నిక్షిప్తం చేసిన జీపీఎస్ ఫెసిలిటీ జియో ట్యాగింగ్‌తో కూడిన షూటింగ్‌కు ఉఫకరిస్తుంది. మే చివరి నాటికి ఈ కెమెరాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లూ, బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ కెమెరాల ధర అంచనా రూ.46,000. ఉత్తమ విలువలతో నిండిన ఫోటోగ్రఫీని కోరుకునే వారికి సోనీ HDR-GW77V ఉత్తమ ఎంపిక.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting