ఖచ్చితమైన ఫోటోగ్రఫీ కోసం సోనీ సైబర్‌షాట్ డిజిటల్ కెమెరా!!!

Posted By: Super

ఖచ్చితమైన ఫోటోగ్రఫీ కోసం సోనీ సైబర్‌షాట్ డిజిటల్ కెమెరా!!!

 

మన్నికతో కూడిన కెమెరాలను ఉత్పత్తి చేయ్యటంలో సోని దశాబ్ధాల కాలంగా  క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. కానోన్, కొడాక్ వంటి దిగ్గజ శ్రేణి కెంపెనీతో పోటి పడే సామర్ధ్యాన్ని సోనీ అనతికాలంలోనే సంపాదించింది. తాజాగా ఈ ఉత్తమ బ్రాండ్ ‘సోని టీఎక్స్55’ మోడల్‌లో డిజిటల్ కెమారాను డిజైన్ చేసింది. సైబర్ షాట్ లైన్‌ప్‌లో వస్తున్న ఈ డివైజ్ మన్నికతో కూడిన ఆధునిక ఫీచర్లను ఒదిగి ఉంటుంది. ఈ కెమెరా ఆపరేటింగ్ ద్వారా సంపూర్ణ ఫోటోగ్రఫీని వినియోగదారుడు నేర్చుకోగలుగుతాడు.

ప్రపంచపు నాజూకైన డిజిటల్ కెమెరాగా ‘సైబర్ షాట్ TX55’ గుర్తింపుతెచ్చుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కెమెరా విడుదల నేపధ్యంలో సోనీ సంస్థ థాయిలాండ్, సింగ‌పూర్‌లలో ‘7 పిక్షర్ ఎఫెక్ట్స్ ఛాలెంచ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఓత్సాహికులు ఫేస్‌బుక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని ఫోటోగ్రఫిలో తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot