క్వాలిటీకి చిరునామా... సోనీ నెక్స్ క్యామ్!

Posted By: Staff

క్వాలిటీకి చిరునామా... సోనీ నెక్స్ క్యామ్!

 

ప్రముఖ ఫోటో కెమెరాల నిర్మాణ సంస్థ సోనీ తాజాగా డిజైన్ చేసిన ప్రొఫెషనల్ క్యామ్‌కార్డర్ విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. NXCAM క్యామ్‌కార్డర్ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ పేరు ‘NEX-EA50EH’.

అత్యాధునిక ఇంటర్ చేంజబుల్ ఈ-మౌంట్ లెన్స్ సిస్టంను ఈ క్యామ్‌కార్డర్‌లో నిక్షిప్తం చేయటంతో మన్నికైన విజువల్స్‌ను యూజర్ చిత్రీకరించుకోగలుగుతాడు. ఇతర ఫీచర్లైన ఆటోఫోకస్, ఆటో ఎక్స్‌పోజర్, ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి అంశాలు కొత్తదనంతో నిండిన వీడియోగ్రఫీని అందిస్తాయి.

హైడెఫినిషన్ సీఎమ్‌వోఎస్ సెన్సార్:

సోనీ ‘NEX-EA50EH’లో నిక్షిప్తం చేసిన Exmor ఏపీఎస్ హైడెఫినిషన్ సీఎమ్ఓఎస్ సెన్సార్ ద్వారా హైడెఫినిషన్ మూవీలతో పాటు హైడెఫినిషన్ ఫోటోలను తక్కువ వెళుతురులో హై లెవల్ సెన్సిటివిటీతో క్యాప్చుర్ చేసుకోవచ్చు. స్టిల్ అదేవిధంగా కదిలే చిత్రాలను సులువుగా అతి సునాయాశంగా షూట్ చేసుకోవచ్చు.

ఇతర ఫీచర్లు:

- షూటింగ్ సమయంలో HXR-FMU128 ఫ్లాష్ మెమెరీ యూనిట్ సాయంతో బ్యాకప్ రికార్డింగ్.

- మిర్రరింగ్ మెమరీ స్టిక్,

- 16జీబి, 32జీబి, 64జీబి మెమరీ స్టోరేజ్ వర్షన్స్,

- 2 ఛానల్ ఎక్స్ఎల్ఆర్ ఆడియో,

- లీనియర్ పీసీఎమ్ ఆడియో,

- బుల్ట్ ఇన్ జీపీఎస్,

- విడుదల ఈ అక్టోబర్‌లో.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting