ఇంజనీరింగ్ కుర్రోడా.. మజాకా!

Posted By: Prashanth

ఇంజనీరింగ్ కుర్రోడా.. మజాకా!

 

ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి ఆవిష్కరించిన అద్భుతమిది. నాసా స్పేస్ మిషన్ చేసే పనిని... ఆ బ్రిటీష్ కుర్రోడు తన అసమాన తెలివితేటలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో సునాయాశంగా చేసేసాడు. వేలకోట్లు ఖరీదు చేసే నాసా స్పేస్ యంత్రం భూగ్రహానికి సంబంధించిన దృశ్యాలను తన శక్తివంతమైన కెమెరాలలో బంధించి నాసాకు పంపంటం మనం చూస్తుంటాం. అయితే, 19 సంవత్సరాల ఆడమ్ కుడ్‌వర్త్ కేవలం తన సాధారణ కానన్ ఏ570 కెమెరాతో 40 గంటల సమయాన్ని వెచ్చించి ఆకాశంలోని అద్భుత దృశ్యాలను సేకరించాడు. దీనిక అతగాడికి అయిన ఖర్చు $600. అది ఏలా సాధ్యమైందని నిర్ఘాంతపోతున్నారా..?. ఈ యువ మేధావికి తట్టిన ఆలోచన ఏంటో తెలుసుకోవాలనుందా..?

ఆడమ్ తన కెమెరా కానన్ ఏ570‌కు జీపీఎస్ డివైజ్‌తో పాటు రేడియో ట్రాన్స్‌మిటర్ అలాగే మైక్రోప్రాసెసర్‌ను అనుసంధానించి మొత్తం సామాగ్రాని ఓ ఇన్సులేటెడ్ బాక్స్‌లో అమర్చాడు. ఆ పెట్టెను గాలిబుడగకు జత చేసి ఆకాశంలోకి విడిచిపెట్టాడు. ఆ బెలూన్ 20 మైళ్ల ఎత్తుకు ప్రయాణించిన అనంతరం ఆడమ్ స్పేస్ కెమెరా అద్భుత విహంగ చిత్రాలను బంధించింది. ఆ బెలూన్ భూమికి తిరిగి చేరుకోటానికి రెండు గంటలన్నర సమయం తీసుకుందట. తన ఇంటికి 30కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయిన ఆ బెలూన్‌ను జీపీఎస్ ఆధారంగా ఆడమ్ చేధించాడు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting