మీ కెమెరాను ఎవరైనా దొంగిలించారా..?

Posted By:

మీ కెమెరా చోరీకి గురైందా..?, ఎన్ని ప్రయత్నాలు చేసినా కెమెరా జాడ తెలియరాలేదా..?, మీ కెమెరాను దొంగిలించిన వ్యక్తి అదే కెమెరాతో ఫోటోలను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టినట్లయితే మీకు దొరికిపోయినట్లే. అది ఏలానో.. మేం తెలపబోయే స్మార్ట్ చిట్కా ద్వారా తెలసుకోండి. స్టోలెన్ కెమెరా ఫైండర్ (Stolen Camera Finder) అనే ఆన్‌లైన్ అప్లికేషన్ కెమెరా జాడను కనుగొనటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ‘EXIF' డేటా సాయంతో ఈ అప్లికేషన్ మీ కెమెరా జాడను పసిగట్టగలదు.

మీ కెమెరాను ఎవరైనా దొంగిలించారా..?

- ముందుగా స్టోలెన్ కెమెరా పైండర్ (Stolen Camera Finder) అప్లికేషన్‌ను మీ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి.

- ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన అనంతరం సదరు అప్లికేషన్‌లోకి లాగినై హోమ్‌పేజీపై క్లిక్ చేయాలి.

- తదుపరి చర్యలో భాగంగా హోమ్‌పేజీ పై  కనిపించే డ్రాగ్‌బాక్స్‌లో మీ పోయిన కెమెరా ద్వారా గతంలో చిత్రీకరించబడిన ఫోటోను ప్లేస్ చేయండి. (గమనిక: మీరు సెలక్ట్ చేసుకున్న ఫోటో ఏ మాత్రం ఎడిట్ చేసినదై ఉండకూడదు.)

- ఇప్పుడు మీరు ప్లేస్ చేసిన ఫోటోకు సంబంధించిన ‘EXIF' డేటాను, స్టోలెన్ కెమెరా పైండర్ అప్లికేషన్ స్వీకరించి వెబ్‌లో శోధించిటం ప్రారంభిస్తుంది.

- మీ కెమెరాను దొంగిలించిన వ్యక్తి అదే కెమెరాతో ఫోటోలు చిత్రీకరించి వాటిని ఆన్‌లైన్‌లో పెట్టినట్లయితే సదురు ఫోటోకు సంబంధించిన ‘EXIF' డేటాను స్టోలెన్ కెమెరా పైండర్ అప్లికేషన్ పసిగట్టి మ్యాపింగ్ వ్యవస్థ ద్వారా ఆచూకీని మీకు తెలుపుతుంది. తద్వారా మీరు మీ కెమెరా జాడను కనుగొనవచ్చు.

- ‘EXIF' డేటా అంటే: డిజిటల్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ప్రతి ఫోటోకు ‘EXIF' డేటా ఉంటుంది. కెమెరా మోడల్ నెంబర్, ఫోటో చిత్రీకరించిన సమయం, తేదీ, షట్టర్ స్పీడ్ వంటి కీలక వివరాలు ‘EXIF' డేటాలో నమోదువుతాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot