పాకెట్ ఫ్రెండ్లీ హైడెఫినిషన్ కెమెరా!

Posted By: Prashanth

పాకెట్ ఫ్రెండ్లీ హైడెఫినిషన్ కెమెరా!

 

పాకెట్ ఫ్రెండ్లీ కెమెరాల జాబితాలోకి మరో కొత్త డ్యాడ్జెట్ చేరింది. యాక్షన్ కెమెరాలను డిజైన్ చేయటంలో ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న వీహో (Veho) తాజాగా రూపొందించిన మువీ(Muvi) హైడెఫినిషన్ యాక్షన్ కెమెరా ప్రస్తుత కెమెరా మార్కెట్ విభాగంలో చర్చనీయాంశంగా మారింది. ఈ హైడెఫినిషన్ కెమెరా సౌజన్యంతో వీడియోలను 720పిక్సల్ క్లారిటీతో 30 నుంచి 60 ఫ్రేమ్స్ పర్ సెకన్ వేగంతో చిత్రీకరించుకోవచ్చు. కెమెరాలో నిక్షిప్తం చేసిన వ్యూఫైండర్ వ్యవస్థ ఉత్తమ వీక్షణ శక్తిని కలిగి ఉంటుంది. రిమోట్ కంట్రోలింగ్ ఫీచర్ మరో ప్రత్యేకత.

Read In English

కీలక ఫీచర్లు:

5 మెగా పిక్సల్ 1/2.5 సీఎమ్ఓఎస్ సెన్సార్,

1.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,

1080 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్,

3x డిజిటల్ జూమ్,

టైమింగ్‌తో కూడిన 5 మెగా పిక్సల్ స్నాప్‌షాట్ ఫంక్షన్,

డేట్ ఇంకా టైమ్ స్టాంప్,

అల్ట్రావైడ్ 160డిగ్రీల వ్యూ,

సెన్సా వైర్‌లెస్ రిమోట్ కంట్రోల్,

పవర్‌ను సేవ్ చేసుకునేందుకు ఆటో స్టాండ్ బై ఆప్షన్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

1400ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల లితియమ్ ఐయోన్ బ్యాటరీ (4 గంటలు బ్యాకప్),

ధర అంచనా రూ.10,000.

సామ్‌సంగ్ స్మార్ట్ కెమెరాలు!

సామ్‌సంగ్ తాజాగా డబ్ల్యు బి, ఎస్‌టి, ఇఎస్, డివి సీరిస్‌లో ఐదు స్మార్ట్ కెమెరాలను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త కెమెరాల్లో డబ్ల్యుబి100 కెమెరా 26ఎక్స్ హైజూమ్ లెన్స్‌తో ఉండగా.. ఎస్‌టి 200ఎఫ్, డివి 300ఎఫ్ కెమెరాల్లో వైఫ్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. ఎస్‌టి 66, డివి 100, ఇఎస్90 కెమెరాల్లో ఆధునిక ఫీచర్లున్నాయి. డబ్ల్యుబి 100 కెమెరాలో 3డి ఫొటోను తీసే సదుపాయం కూడా ఉంది. దీని ధర 14,490 రూపాయలు. డివి 300ఎఫ్ ధర 12,400 రూపాయలు, డివి 100 ధర 8,900 రూపాయలు, ఎస్‌టి 200 ఎఫ్ ధర 12,400 రూపాయలు, ఎస్‌టి 55 ధర 7,900 రూపాయలు, ఇఎస్ 90 ధర 6,400 రూపాయలుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot