రూ.10,499 ధరకు 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G ఫోన్..!
Vivo Y19s 5G Smartphone Launched : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో భారత్ మార్కెట్ లో తాజాగా వివో V19s 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఫలితంగా పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. దీంతోపాటు HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ చిప్‌సెట్, 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
వివో Y19s 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.74 అంగుళాల (1600 x 720 పిక్సల్స్) HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ SGS, మిలిటరీ గ్రేడ్ MIL - STD - 810H షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లను కలిగి ఉంది. ఫలితంగా పొరపాటున కిందపడినా, డ్యామేజీ కాకుండా ఉంటుందని వివో చెబుతోంది.

2TB వరకు స్టోరేజీ! :
ఈ ఫోన్ 6nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు Arm Mail G57 MC2 GPU ను కూడా అమర్చి ఉంది. మీడియాటెక్ చిప్‌సెట్ 4GB/6GB LPDDR4x ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

6000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 13MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
వివో V19s 5G ఫోన్ ధర, సేల్ :
ఈ ఫోన్ 4GB/64GB ధర రూ.10,999, 4GB/128GB ధర రూ.11,999, 6GB/128GB ధర రూ.13,499 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ను ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉందని వివో తెలిపింది. ఎంట్రీ లెవల్ లో భారీ బ్యాటరీ ఫోన్‌ల కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.2, Wi-Fi 802.11ac, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








