ఎప్పుడైనా, ఎక్కడైనా... నేను రె‘ఢీ’!

Posted By: Prashanth

ఎప్పుడైనా, ఎక్కడైనా... నేను రె‘ఢీ’!

 

ఫోటో కెమెరా నిర్మాణ సంస్థ ఫుజిఫిల్మ్ సరికొత్త వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. మోడల్ ఫైన్‌పిక్స్ FP170. కొత్త జనరేషన్ ఫోటోగ్రఫీ విభాగంలో రాణించాలనుకునే యువతకు ఈ కెమెరా ఉత్తమ ఎంపిక. వైర్‌లెస్ ఫీచర్ ఆధారంగా ఈ డివైజ్‌లోని ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దుమ్ము, చమ్మ, వేడి వంటి ప్రతికూల పరిస్ధితులను ఫైన్ పిక్స్ FP170 సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

14 మెగా పిక్సల్ కెమరా సెన్సార్,

వాటర్ ప్రూఫ్ (33ఫీట్),

వైర్‌లెస్ ఇమేజ్ ట్రాన్సఫర్,

షాక్‌ఫ్రూఫ్ (6.5 అడుగులు),

ఫ్రీజ్‌ప్రూఫ్ (14డిగ్రీలు వరకు),

వీడియో రికార్డింగ్ సౌలభ్యత.

ఈ హై క్లారిటీ కెమెరా ఫోటోలను ఉత్తమ క్వాలిటీతో చిత్రీకరిస్తుంది. డివైజ్ 33 అడుగుల లోతైన నీటిలో పడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. మరో షాక్‌ప్రూఫ్ వ్యవస్ధ కెమెరా 6 అడుగుల పై నుంచి కిందపడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. కెమెరాలో దోహదం చేసిన వైర్‌లెస్ ఇమేజ్ అప్లికేషన్‌తో కెమెరాను ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సౌలభ్యతతో ఫోటోలతో పాటు వీడియోలను వైర్ల సాయం లేకుండా షేర్ చేసుకోవచ్చు. ధర అంచనా రూ.15,000 విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot