ప్రపంచపు అతిచిన్న కెమెరా!

Posted By: Staff

ప్రపంచపు అతిచిన్న కెమెరా!

ప్రముఖ ఫోటోకెమెరాల తయారీ సంస్థ పాయింట్ గ్రే (Point Grey) ప్రపంచపు అతిచిన్న యూఎస్బీ కెమెరాను డిజైన్ చేసింది. ఐస్ క్యూబ్ పరిమాణాన్ని కలిగి ఉండే ఈ కెమెరా 4,096 x 2,160రిసల్యూషన్ సామర్ధ్యం గల ఫోటోలను యూఎస్బీ 3.0 పోర్టు గుండా విడుదల చేస్తుంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన సోనీ సరికొత్త IMX1221 Exmor R సెన్సార్ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఉత్పత్తి చేస్తుంది. పరిశ్రమ ఇతర వ్యాపార అంశాలకు సంబంధించి హై రిసల్యూషన్ చిత్రాలను సేకరిచంటంలో ‘4K USB 3.0’ కెమెరా తోడ్పడుతుంది.

కెమెరాలో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లు:

- 8.8 మెగాపిక్సల్, 4కె2కె సెన్సార్,

- సోనీ IMX1221 Exmor R సెన్సార్,

- 32 మెగాబైట్ ఫ్రేమ్ బఫర్,

- యూఎస్బీ 3.0 సెటప్,

- ధర రూ.48,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot