హైడెఫినిషన్ క్యామ్‌కార్డర్ జస్ట్ 10,000లకే!

Posted By: Prashanth

హైడెఫినిషన్ క్యామ్‌కార్డర్ జస్ట్ 10,000లకే!

 

క్యామ్ కార్డర్‌ల తయారీ విభాగంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న జూమ్ (Zoom) సంస్థ తాజాగా తన జాబితాలోకి ‘క్యూ2హెచ్‌డి’ పేరుతో కొత్త గ్యాడ్జెట్‌ను చేర్చింది. స్పెసిఫికేషన్‌ల పరంగా ఈ డివైజ్ మిగితా వర్షన్‌లను అధిగమించింది. మెరుగుపర్చిన యూజర్ ఇంటర్ఫేస్ ఇంకా నవీకరించబడిన కెమెరా సెన్సార్ వ్యవస్థలు ఈ హ్యాండీ వీడియో రికార్డర్ ప్రధాన ప్రత్యేకతలు... కెమెరాను కంప్యూటర్‌కు అనుసంధానించుకుని లైవ్ స్ట్రీమింగ్ నిర్వరహించుకోవచ్చు.

క్యామ్ కార్డర్ ప్రధాన ఫీచర్లు:

5 మెగా పిక్సల్ 1/3.2″ సిఎమ్ వోఎస్ సెన్సార్,

హై‌డెఫినిషన్ వీడియో రికార్డింగ్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

రికార్డ్ 24-బిట్, 96 kHz లీనియర్ పీసీఎమ్ ఆడియో,

యూస్ట్రీమ్ లైవ్ వీడియో స్ట్రీమింగ్,

ఇంటిగ్రేటెడ్ మిడ్- సైడ్ స్టీరియో మైక్రోఫోన్,

రిఫరెన్స్ స్పీకర్,

మినీ హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్, మినీ యూఎస్బీ 2.0 పోర్ట్,

మిడ్-సైడ్ యూఎస్బీ మైక్రోఫోన్,

లో-కట్ ఫిల్టర్, ఎనలాగ్ మైక్ గెయిన్ కంట్రోల్,

లైట్ సెలక్షన్ ఆప్షన్, 4x డిజిటల్ జూమ్,

SD/SDHC/SDXC కార్డుల ద్వారా మెమరీని 64జీబికి పెంచుకోవచ్చు.

హైడెఫినిషన్ వీడియో రికార్గింగ్, లైవ్ స్ట్రీమింగ్, మిడ్-సైడ్ స్టీరియో వంటి పటిష్టమైన ఫీచర్లతో విడుదల కాబోతున్న ‘జూమ్ క్యూ2హెచ్ డి’ మార్కెట్ ధరను రూ.10,000గా అంచనా వేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot