తెరపైకి మలేషియా సంస్థ!

Posted By: Prashanth

తెరపైకి మలేషియా సంస్థ!

 

ఇండియన్ గ్యాడ్జెట్ ప్రియులకు సుపరిచితమైన టాబ్లెట్ కంప్యూటర్ ‘ఆకాష్’, పూర్తి స్తాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రానప్పటికి దేశవ్యాప్తంగా సృష్టించిన హైప్ అంతా ఇంతా కాదు. ప్రధానంగా విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన ఈ టబ్లెట్లు రాయితీ పై తక్కువ ధరకే లభ్యమవడం విశేషం.

ఆకాష్ టాబ్లెట్ తరహాలో మలేషియాకు చెందిన ‘మాల్‌టెక్ ప్రో’ సంస్థ వన్ మలేషియన్ ప్యాడ్ పేరుతో అక్కిడి విద్యార్ధుల కోసం టాబ్లెట్ పీసీని వృద్ధి చేసింది. ముందుగా ఫిక్స్ చేసిన డిస్కౌంట్ ధరకు ఈ డివైజ్‌ను విద్యార్థులకు విక్రయించనున్నారు. సాధారణ వినయోగదారుల కోసం రిటైల్ మార్కెట్లో ఈ పీసీని రూ.16,000లకు అమ్మనున్నారు.

1మలేషియా ప్యాడ్ ఫీచర్లను పరిశీలిస్తే:

- 3జీ బ్రాడ్‌బ్యాండ్ సామర్ధ్యం,

- 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

- 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో టాబ్లెట్ మెమెరీని 32జీబికి పెంచుకునే వెసలుబాటు,

- ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,(త్వరలోనే ఈ వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌గ్రేడ్ చేసే సౌలభ్యత),

- వన్ మలేషియా మెసెంజర్ అప్లికేషన్,

- సుదీర్ఘ బ్యాకప్‌నిచ్చే 400ఎమ్ఏహెచ్ లి-పాలిమర్ బ్యాటరీ,

ఆకాష్ టాబ్లెట్ ఫీచ్లర్లు:

* 7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్), * ధృడమైన టచ్ సామర్ధ్యం, * ర్యామ్ పరిమాణం 256 ఎంబీ, * 2జీబి ఇంటర్నల్ ఫ్లాష్ మెమరీ, * ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు, * జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, WLAN,* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * 366 MHz కోనెక్సంట్ ప్రాసెసర్, * గ్రాఫిక్ యాక్సిలరేటర్, * బ్యాటరీ బ్యాకప్ 3 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot