‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

|

విండోస్ 9 ఆపరేటింగ్ సిస్టం కోసం యూవత్ కంప్యూటింగ్ ప్రపంచం ఎదురు చూసిన తరుణంలో మైక్రోసాఫ్ట్ ఒక నంబర్‌ను తప్పించి విండోస్ 8 నుంచి ఏకంగా విండోస్ 10కు అప్‌గ్రేడ్ అవుతున్నట్లు ప్రకటించింది. వివిధ వర్షన్‌ల విండోస్ ఆపరేటింగ్ సిస్టంలను వినియోగిస్తోన్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలోనే ఉంది. ఈ నేపథ్యంలో విండోస్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.

విండోస్7కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రెండు సంవత్సరాల క్రితం విడుదలైన విండోస్8కు వినియోగదారుల నుంచి అంతగా ఆదరణ లభించలేదు. విండోస్8ను కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని సాంకేతిక అంశాల పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. విండోస్ 8 ఇంటర్‌ఫేస్‌లో స్టార్ట్ బటన్ పాపప్ మెనూ లేకపోవటం పలువురిని నిరాశకు గురి చేసింది. ఈ తరుణంలో ఒకడుగు ముందుకేసిన మైక్రోసాఫ్ట్ ఏకంగా విండోస్ 10ను ఆవిష్కరించి యూవత్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు... ఇలా అన్నింటికి ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇప్పటి వరకు తాము విడదల చేసిన అన్ని విండోస్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కల్లా విండోస్ 10 అత్యుత్తమంగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ హామీ ఇస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న మైక్రోసాఫ్ట్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10' 2015లో అందుబాటులోకి రానుంది. విండోస్ 10 ఓఎస్ లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

కొత్త లుక్‌లో స్టార్ట్ మెనూ

విండోస్ 10లో పొందుపరిచిన స్టార్ట్ మెనూ కొత్త లుక్‌లో మరింత యూజర్ ఫ్రెండ్లీగా దర్శనమిస్తుంది. ఈ సరికొత్త స్టార్ట్ మెనూ సాంప్రదాయ అలానే మోడ్రన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

మల్టిపుల్ డెస్క్‌‌టాప్స్

యాపిల్ మ్యాక్ కంప్యూటర్స్ తరహాలో విండోస్ 10 యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై మల్టిపుల్ డెస్క్‌‌టాప్‌లను ఓపెన్ చేసుకుని వాటిలో కావల్సిన విండోలను ఓపెన్ చేసుకుంటూ సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

ఓపెన్ చేసి ఉన్న విండోలను తిలకించేందుకు ప్రత్యేక బటన్

సాధారణంగా విండోస్ యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు Alt+Tab షార్ట్‌కట్‌ను వినియోగిస్తుంటారు. అయితే, విండోస్ 10 యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు ఓ ప్రత్యేకమైన బటన్‌ను విండోస్ 10 టాస్క్‌బార్‌లో పొందుపరిచింది. ఈ టాస్క్ స్విచర్ మల్టీ టాస్కింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

యూనివర్సల్ సెర్చ్

విండోస్ 10లోని స్టార్ట్ మెనూతో సమీకృతం చేయబడిన సరికొత్త యూనివర్సల్ సెర్చ్ ఫీచర్ ద్వారా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లతో పాటు వెబ్‌లోని అంశాలను శోధించవచ్చు. మైక్రోసాఫ్ట్ సెర్చ్‌ఇంజన్ ‘బింగ్' వెబ్‌సెర్చ్‌కు తోడ్పడుతుంది.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

స్నాప్ వ్యూ

విండోస్ 10లో ఏర్పాటు చేసిన స్నాప్ వ్యూ ఫీచర్ ద్వారా ఏకకాలంలో నాలుగు అప్లికేషన్‌లను స్ర్కీన్ పై ఓపెన్ చేసుకుని లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

సాంప్రదాయ పీసీలో మోడ్రన్ యాప్స్

విండోస్ 10 యూజర్లు తమ పీసీలో మోడ్రన్ అప్లికేషన్‌లతో పాటు సాంప్రదాయ (ట్రెడిషనల్) అప్లికేషన్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

యూనివర్సల్ అప్లికేషన్ స్టోర్

ఈ యాప్ స్టోర్ విండోస్ 10 ఆధారిత డెస్క్‌టాప్, టాబ్లెట్ అలానే స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 యూజర్లు తమకు కావల్సిన యాప్‌లను ఈ స్టోర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

కాంటినుమ్

విండోస్ 10 నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన కాంటినుమ్ ఫీచర్ 2 ఇన్ 1 విండోస్ డివైస్‌లకు మరింత ఉపయుక్తంగా నిలస్తుంది. మీరు ఉపయోగించే మోడ్‌ను బట్టి ఉపయోగానికి అనువుగా స్ర్కీన్ రూపం మారుతుంటుంది.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

కొత్త కమాండ్ ప్రాంప్ట్

విండోస్ 10లో వినియోగించిన కమాండ్ ప్రాంప్ట్ సరికొత్త ఫీచర్లతో అలరిస్తుంది.

 

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

‘విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

వ్యాపార సంస్థలకు మరింత ఉపయుక్తం

వ్యాపార సంస్థలకు దోహదపడే విధంగా అత్యుత్తమ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌ను విండోస్ 10లో నిక్షిప్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
10 great new features in Windows 10. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X