ల్యాప్‌టాప్ కొనేముందు ఈ 10 విషయాలు గుర్తుపెట్టుకోండి

By Anil
|

డెస్క్‌టాప్ పీసీలకు అప్‌డేటెడ్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన ల్యాప్‌‌టాప్‌లు, పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని జాబ్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లను అనేక విధాలుగా వాడుకుంటున్నారు. ల్యాప్‌టాప్ డెస్క్‌టాప్‌ కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది.అయితే ల్యాప్‌టాప్ కొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అన్ని ల్యాపీలలో అందుబాటులో ఉండవు.ఈ శీర్షిక లో భాగంగా ల్యాప్‌టాప్ కొనేముందు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలను మీకు తెలుపుతున్నాం.

 

వారెంటీ :

వారెంటీ :

ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ముందుగా చూసుకోవాల్సింది వారెంటీ ఎందుకంటే ఒక్కోసారి ల్యాప్‌టాప్ హార్డ్ వేర్ పార్ట్స్ పని చేయకుండా పోవచ్చ. ఆ పరిస్థితులలో మీరు కొనే ల్యాప్‌టాప్ పై వారెంటీ ఉంటె రీప్లేస్ చేసుకోవడనికి అయిన లేదా సర్వీసింగ్ చేయించుకోవడానికైన వీలుగా ఉంటుంది.

డిస్‌ప్లే సైజ్:

డిస్‌ప్లే సైజ్:

మీరు కొనాలి అనుకున్న ల్యాప్‌టాప్ ఖచ్చితమైన డిస్‌ప్లే సైజులో ఉండాలి. 15 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ల్యాప్‌టాప్ మీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు మంచి రీప్లేస్‌మెంట్‌గా భావించవచ్చు. మార్కెట్లో 12 అంగుళాల సైజులో ల్యాప్‌టాప్‌లు దొరకుతున్నప్పటికి, ఇవి డెస్క్‌టాప్‌తో పోటీగా పనిచేయకపోవచ్చు.

 స్పెషల్ ఫీచర్స్ :
 

స్పెషల్ ఫీచర్స్ :

కొన్నిలాప్‌టాప్‌లు , ప్రత్యేకంగా వ్యాపార మరియు సంస్థల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఫీచర్స్ ఉన్న ల్యాపీలను అందిస్తూ ఉంటాయి.ఉదాహరణకు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు బిజినెస్ PC లలో కనిపిస్తాయి.ఈ ల్యాపీల వినియోగదారులకు ఆపరేటింగ్ సిస్టం లో లాగిన్ అవ్వడానికి స్కాన్ పాస్ అవసరం అవుతుంది.

పోర్ట్స్ ఎక్కువుగా ఉండాలి:

పోర్ట్స్ ఎక్కువుగా ఉండాలి:

మీరు కొనాలి అనుకున్న ల్యాప్‌టాప్‌కు పోర్ట్స్ (Ports) చాలా ముఖ్యం. స్టాండర్డ్ ల్యాప్‌టాప్‌కు కనీసం రెండు మూడు పోర్ట్స్ అయినా ఉండాలి. వీటి ద్వారా మీ డివైస్‌ను రకరకాల డివైస్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఆడియో జాక్ కూడా అవసరం.

ఆప్టికల్ డ్రైవ్ అవసరం:

ఆప్టికల్ డ్రైవ్ అవసరం:

మీరు కొనాలి అనుకున్న ల్యాప్‌టాప్‌కు ఆప్టికల్ డ్రైవ్ తప్పనిసరి. ఆప్టికల్ డ్రైవ్ ద్వారా cd,dvd మరియు BlueRay డీవీడీ లను రీడ్ చేయవచ్చు.

స్టోరేజ్ మరియు మెమరీ:

స్టోరేజ్ మరియు మెమరీ:

ల్యాప్‌టాప్‌ కొనేటప్పుడు ముందుగా చూసుకోవాల్సిన విషయం స్టోరేజ్ మరియు మెమరీ.డేటా ఎక్కువ సేవ్ చేసుకోవాలి అనుకునేవారికి ల్యాప్‌టాప్‌ స్టోరేజ్ మరియు మెమరీ ఎంత ఎక్కువ ఉంటె అంత మంచిది.

ప్రాసెసర్ మరియు గ్రాఫిక్స్:

ప్రాసెసర్ మరియు గ్రాఫిక్స్:

ల్యాప్‌టాప్‌ లో ప్రోగ్రామ్స్ ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుందో ప్రాసెసర్ బట్టి అర్థం అవుతుంది.అలాగే మంచి గ్రాఫిక్స్ ఉన్న ల్యాప్‌టాప్‌ క గేమింగ్ ప్రియులకు బాగా ఉపయోగపడుతుంది.

స్క్రీన్ సైజ్ మరియు రిసల్యూషన్:

స్క్రీన్ సైజ్ మరియు రిసల్యూషన్:

మీరు ఎంచుకున్న ల్యాప్‌టాప్‌ పెద్ద స్క్రీన్ సైజు లో హై రిసల్యూషన్ తో కలిగి ఉండాలి

బరువు:

బరువు:

ఒకప్పుడు చాలా ఎక్కువ బరువుతో ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉండేవి .అయితే ఇప్పుడు చాలా తేలిక పాటి బరువు గల ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ లైఫ్ :

బ్యాటరీ లైఫ్ :

ఎక్కువ బ్యాటరీ లైఫ్ గల ల్యాప్‌టాప్‌ ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు ఛార్జ్ పెట్టుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఎక్కువ బ్యాటరీ లైఫ్ గల ల్యాప్‌టాప్‌ ను కొనడం ఉత్తమమైన పని.

Best Mobiles in India

English summary
10 Things to Look for When Buying a Laptop.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X