మీ కంప్యూటర్ సతాయిస్తోందా, అయితే ఈ టిప్స్ ట్రై చేయండి

నేటి కంప్యూటర్ యుగంలో పలు రకాల అవసరాలకు పర్సనల్ కంప్యూటర్ల వినియోగం గణనీయంగా పెరిగింది.

|

నేటి కంప్యూటర్ యుగంలో పలు రకాల అవసరాలకు పర్సనల్ కంప్యూటర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. మధ్యతరగతి ప్రజలు కూడా కంప్యూటర్ ను వినియోగిస్తున్నారు. కాబట్టి అది చాలా ఫాస్ట్ గా పనిచేయాలని అందరూ కోరుకుంటుంటారు. కొన్ని సార్లు అది మనల్ని సతాయిస్తూ ఉంటుంది. పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందంటే కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్‌ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో 'పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే చిట్కాలు, సాఫ్ట్‌వేర్‌లు ఏంటనేవి చూద్దాం.

 

ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లతో గ్రాండ్ ఎంట్రీఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లతో గ్రాండ్ ఎంట్రీ

ఎప్పటికప్పుడు క్లీన్‌

ఎప్పటికప్పుడు క్లీన్‌

సీ,డీ,ఈ,ఎఫ్‌ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు క్లీన్‌, డీఫ్రాగ్మెంటేషన్‌ చేయడం ద్వారా పీసీ వేగాన్ని కొంతమేర పెంచొచ్చు. అందుకు MyComputer-> Drive-> Right Click-> Properties-> Tools-> Defragment Now క్లిక్‌ చేయాలి.

టెంపరరీ ఫైల్స్‌

టెంపరరీ ఫైల్స్‌

టెంపరరీ ఫైల్స్‌ తీసేయాలంటే Start-> Runలోకి వెళ్లి %temp%, recent అని టైప్‌ చేసి ఓకే చేయండి. వచ్చిన విండోలోని టెంపరరీ ఫైల్స్‌ని డిలీట్‌ చేయండి.

స్టార్ట్‌అప్‌లో..

స్టార్ట్‌అప్‌లో..

స్టార్ట్‌అప్‌లో అక్కర్లేని పొగ్రాంలను డిసేబుల్‌ చేయవచ్చు. అందుకు రన్‌లోకి వెళ్లి msconfig టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. వచ్చిన విండోలోని 'స్టార్ట్‌అప్‌' ట్యాబ్‌లోకి వెళ్లి అక్కర్లేని ప్రొగ్రాంలను అన్‌చెక్‌ చేసి సిస్టంని రీస్టార్ట్‌ చేయండి.

ట్యూన్‌అప్‌ యుటిలిటీస్‌
 

ట్యూన్‌అప్‌ యుటిలిటీస్‌

'ట్యూన్‌అప్‌ యుటిలిటీస్‌' సాఫ్ట్‌వేర్‌లో సిస్టమ్ సామర్థాన్ని పెంచే సదుపాయాలు ఉన్నాయి. డెస్క్‌టాప్‌పై తక్కువ ఐకాన్లు ఉంచాలి. ఎక్కువ మెమొరీతో కూడిన ఫైల్స్‌ పెట్టడం మంచిది కాదు. CCleaner, Zappit System Cleaner, SS Disk Cleaner టూల్స్‌తో అనవసరమైన ఫైల్స్‌ని తొలగించవచ్చు.

అక్కర్లేని సాఫ్ట్‌వేర్‌లను

అక్కర్లేని సాఫ్ట్‌వేర్‌లను

అక్కర్లేని సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి. అందుకు సిస్టంలోనే Add/Remove సిద్ధంగా ఉంది. Start-> Settings-> Control Panel-> Add or Remove Programs క్లిక్‌ చేసి అక్కర్లేని వాటిని తొలగించాలి.

యాంటీ వైరస్‌లను

యాంటీ వైరస్‌లను

యాంటీ వైరస్‌లను అప్‌డేట్‌ చేయాలి. టెంపరరీ ఫైల్స్‌ని మాన్యువల్‌గా తొలగించడం కష్టం అయితే Temp File Cleaner నిక్షిప్తం చేసుకోండి.

హార్డ్‌వేర్ భాగాలు

హార్డ్‌వేర్ భాగాలు

మీ పీసీలో యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేసి స్కాన్ చేసుకున్నట్టే మీ పీసీలో హార్డ్‌వేర్ భాగాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? కూడా చేక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్.

start menu-run డైలాగ్ బాక్స్‌లో..

start menu-run డైలాగ్ బాక్స్‌లో..

చెక్ చేయడం చాలా సులభం. కంట్రోల్ ప్యానెల్‌లో డివైస్ మేనేజర్‌ను ఎంచుకుని అందులో సిస్టమ్‌నీ, దానిలో హార్డ్‌వేర్‌ని ఎంచుకుని దేనిలో సమస్యలున్నయా? అని చెక్ చేసుకోవచ్చు. దీనికన్నా సులభంగా పని ముగించుకోవాలంటే start menu-run డైలాగ్ బాక్స్‌లో winmsd అని టైప్ చేసి ఎంటర్‌కీ ప్రెస్ చేయండి. ఇక హార్డ్‌వేర్ పరిస్థితిని విరవించే రిపోర్టు రెడీగా కనిపిస్తుంది.

అనవసర సాఫ్ట్‌వేర్‌లను..

అనవసర సాఫ్ట్‌వేర్‌లను..

ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

యాంటీ వైరస్ అప్‌డేట్‌

యాంటీ వైరస్ అప్‌డేట్‌

పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.

డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు..

డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు..

మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

 మరింత మెరుగ్గా పనిచేసేందుకు..

మరింత మెరుగ్గా పనిచేసేందుకు..

పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీకరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

Best Mobiles in India

English summary
Is your computer slow? 10 ways to make it run faster more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X