డెల్ ల్యాప్‌టాప్ ఇప్పుడు 11 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో

Posted By: Super

డెల్ ల్యాప్‌టాప్ ఇప్పుడు 11 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో

 

మార్కెట్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో  డెల్ నిమగ్నమైంది. ప్రస్తుత ట్రెండ్ అనుసరిస్తున్న పోకడలను అంచనావేస్తూ వారికి సరితూగే ఉత్పత్తులను రూపొందించే దిశగా ఈ దిగ్గజ బ్రాండ్ వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో 11 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో అతి నాజూకైన ల్యాప్‌టాప్‌ను డెల్ డిజైన్ చేసింది. ‘డెల్ 11జడ్’గా మీ ముందుకు రాబోతున్న ఈ ల్యాపీ పర్‌ఫెక్ట్ నెట్‌బుక్ స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది.

కీలక ఫీచర్లు:

•   11.6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

•    ఒక్క అంగుళం మందం,

•   3 పౌన్ల బరువు,

•   250జీబి హార్డ్‌డ్రైవ్,

•   కోర్ ఐ3 ప్రాసెసర్,

•   3.5జీబి ఇంటర్నల్ స్టోరేజి,

•   డెల్  1397 ఏబీజీ వైర్‌లెస్,

•   స్టాండర్డ్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

•   ఇంటెక్స్ ఎక్స్4500 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్,

•   విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

•   సిక్స్ సెల్ బ్యాటరీ,

•   రెండు సంవత్సరాల వారంటీ.

వర్డ్ ప్రాసెసింగ్ అదేవిధంగా ఇంటర్నెట్ వ్యవహారాలు చక్కదిద్దుకునే వారికి ఈ కూల్ ల్యాపీ ఉత్తమమైన ఎంపిక. గ్యాడ్జెట్‌లో అమర్చిన కీబోర్డ్ లే అవుట్ ఉత్తమమైన టైపింగ్‌కు తోడ్పడుతుంది. కేవలం బటన్ క్లిక్‌తో డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను మార్చుకోవచ్చు. సింగిల్ ఛార్చ్‌తో కొన్ని గంటల పాటు ల్యాపీని రన్ చేసుకోవచ్చు. ఆడియో మరియు ఎస్‌డిహెచ్‌సీ స్లాట్‌లను డివైజ్ కుడి భాగంలో అమర్చారు. ల్యాన్, హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ

ఆప్షన్‌లను గ్యాడ్జెట్ ఎడమ భాగంలో నిక్షిప్తం చేశారు.

ఈ పీసీ ఇంటర్నల్ డిజైనింగ్  మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏర్పాటు చేసిన యూఎస్బీ వ్యవస్థ వేగవంతతమైన డేటా ట్రాన్స్‌ఫర్‌కు సహకరిస్తుంది.  ధర రూ.16,000. స్వల్ప బరువతో ట్రెండీ స్టైల్‌లో డిజైన్ కాబడిన ఈ కూల్ ల్యాప్‌టాప్ మీ కమ్యూనికేషన్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot