1200 సంవత్సరాల నాటి ట్యాబ్లెట్ కంప్యూటర్

Posted By:

1200 సంవత్సరాల నాటి ట్యాబ్లెట్ కంప్యూటర్

నేడు మనకు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ పురాతన కాలంలోనే ఓ వెలుగు వెలిగిందా..?, చరిత్రపుటల సాక్షిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఈ వాదనకు మరింతగా బలం చేకూరుస్తున్నాయి. తాజాగా టర్కిష్ పురాతత్వ పరిశోధకులు చెక్కతో తయారైన 1200 సంవత్సరాల నాటి కంప్యూటర్‌ను గుర్తించారు. టర్కిష్ రాజధాని ఇస్తాంబుల్‌కు సమీపాన ఉన్న ఎనికపీ ఓడరేవు ప్రాంతంలో సముద్రంలో మునిగి ఉన్న ఓ పురాతన ఓడలో ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను పొలి ఉన్న చెక్క వస్తువును గుర్తించినట్లు వారు పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ ఓడ 9వ శతాబ్థం నాటిదిగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 7 అంగుళాల పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ తరహాలో ఉన్నఆ చెక్క వస్తువును బహుశా ఆ నౌక సారథి ఉపయోగించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ చెక్క వస్తువు పై ఐదు దీర్ఘచతురస్రాకర ప్యానల్స్‌తో పాటు ఫ్రేములను  గ్రీకు సంకేతాలతో అమర్చినట్లు వారు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting