Home
Computer

Windows ఎర్రర్ కోడ్స్, వాటికి సొల్యూషన్స్

విండోస్ కంప్యూటర్‌లలో తలెత్తే కామన్ ఎర్రర్స్...

By Sivanjaneyulu Bommu

మనం పీసీ లేదా ల్యాప్‌టాప్‌ మీద వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో Errors అనేవి తలెత్తుత్తుంటాయి. ఈ ఎర్రర్స్ అనేవి Error #2, Error #5, Error #6, Error #20, Error #71 ఇలా రకరకాల కోడ్‌లతో ఉంటాయి. పీసీ లేదా ల్యాప్‌టాప్‌‌లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాటి గురించి మనల్సి అప్రమత్తం చేసేందుకు ఈ ఎర్రర్స్ అనేవి స్ర్కీన్ పై ప్రత్యక్ష- మవుతుంటాయి. అయితే, ఈ విధమైన ఎర్రర్స్ మీ కంప్యూటర్‌లో ఎదురైనపుడు వాటిని మీరు ఇన్‌స్టెంట్‌గా పరిష్కరించుకోవల్సి ఉంటుంది. విండోస్ కంప్యూటర్‌లలో తలెత్తే కామన్ ఎర్రర్ కోడ్స్ అలానే వాటి పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం..

 Error #2

Error #2

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, సిస్టం స్పైసిఫైడ్ ఫైల్‌ను గుర్తించలేకపోతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా NCP & DUNలను రీఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది.

Error #5

Error #5

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, Access Denied అని అర్థం. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా మీరు ఎంటర్ చేసిన యూజర్‌నేమ్ అలానే పాస్‌వర్డ్ సరైనదో కాదో చెక్ చేసుకోవాలి. సమస్య అప్పటికి పరిష్కారం కాకపోయినట్లయితే Accept any authentication including clear text అనే ఆప్షన్ యాక్టివేట్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ యాక్టివేట్ అయి లేనట్లయితే యాక్టివేషన్ చేయండి.

Error #6

Error #6

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, Stack Overflow అని అర్థం.ఈ సమస్యకు పరిష్కార మార్గంగా మీ సిస్టంను కోల్డ్ బూటింగ్ చేసే ప్రయత్నం చేయండి.సమస్య అప్పటికి పరిష్కారం కాకపోయినట్లయితే ర్యామ్ లేదా Swap fileలో ఏదో సమస్య ఉన్నట్లే.

Error #20

Error #20

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, మీ సిస్టం స్పైసిఫైడ్ డివైస్‌ను గుర్తించలేకపోతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా సరైన మోడెమ్‌ను సెలక్ట్ చేుసుకోవల్సి ఉంటుంది.

Error #71

Error #71

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, No more connections are allowed అని అర్థం చేసుకోవాలి. మీ సిస్టం ఆ కనెక్షన్‌ను Allow చేయటం లేదంటే, ఆ అడ్రస్‌తో కూడిన అకౌంట్‌ను అప్పటికే వేరే వ్యక్తులు ఉపయోగించుకుంటున్నట్లే. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ఇంటర్నెట్ సర్వీసుకు కాల్ చేసి మీ పేరు మీద ఇప్పటికే వినియోగించబడుతోన్న గోస్ట్ ప్రోగ్రామ్ ను ఆఫ్ చేయవల్సి ఉంటుంది.

 Error #600

Error #600

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, ఆపరేషన్ పెండింగ్‌లో ఉందని అర్థం. ఇలాంటపుడు కంప్యూటర్‌ను రీబూట్ చేయవల్సి ఉంటుంది. రీబూల్ అవుతోన్న సమయంలో మోడెమ్‌లో ఏ విధమైన ప్రోగ్రామ్ రన్ అవుతుండకూడదు.

Error #604

Error #604

ఈ కొడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, తప్పుడు సమాచారం స్పైసిఫైడ్ కాబడినట్లు ఉందని అర్థం. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా మీరు ఎంటర్ చేసిన యూజర్‌నేమ్ అలానే పాస్‌వర్డ్ సరైనదో కాదో చెక్ చేసుకోవాలి. సమస్య అప్పటికి పరిష్కారం కాకపోయినట్లయితే మోడెమ్‌ను రీఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది.

 Error #607

Error #607

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే, ఈవెంట్ ఇన్‌వ్యాలీడ్ అని అర్థం. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా సిస్టను రీబూట్ చేయవల్సి ఉంటుంది. అంతే కాకుండా.. డైలర్, నెట్‌వర్క్ సెట్టింగ్‌లను చెక్ చేసుకోవాలి. సమస్య అప్పటికి పరిష్కారం కాకపోయినట్లయితే NCP & DUNలను రీఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది.

Error #608

Error #608

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే device does not exist అని అర్థం. ఈ విధమైన సమస్య తలెత్తినప్పుడు మోడెమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పనిచేయకపోతున్నట్లయితే మోడెమ్‌ను రీఇన్‌స్టాల్ చేసి చూడండి. సమస్య అప్పటికి పరిష్కారం కాకపోయినట్లయితే modem diagnostics చేయవల్సి ఉంటుంది.

 Error #621

Error #621

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే Cannot open/load the phone book file అని అర్థం. ఈ విధమైన సమస్య తలెత్తినప్పుడు బ్లూ ఫ్రాగ్ కనెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను మరోసారి ఇన్‌స్టాల్ చేయండి.

Error #635

Error #635

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే Unknown Error అని అర్థం. ఈ విధమైన సమస్య తలెత్తినప్పుడు కంప్యూటర్‌ను రీబూట్ చేయటంతో పాటు బ్లూ ఫ్రాగ్ కనెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను మరోసారి ఇన్‌స్టాల్ చేయండి.

Error #636

Error #636

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే wrong deviceను పోర్ట్‌కు అటాచ్ చేసినట్లు అర్థం. ఈ విధమైన సమస్య తలెత్తినప్పుడు సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని సరైన మోడెమ్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

Error #638

Error #638

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే The request has timed out అని అర్థం. ఈ విధమైన సమస్య తలెత్తినప్పుడు కంప్యూటర్‌ను రీబూట్ చేయటంతో పాటు బ్లూ ఫ్రాగ్ కనెక్షన్ సాఫ్ట్‌వేర్‌ను మరోసారి ఇన్‌స్టాల్ చేయండి.

Error #645

Error #645

ఈ కోడ్‌తో ఉన్న ఎర్రర్ మెసేజ్ మీ కంప్యూటర్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అయినట్లయితే Internal authentication error అని అర్థం. ఈ విధమైన సమస్య తలెత్తినప్పుడు కంప్యూటర్‌ను రీబూట్ చేయటంతో పాటు మోడెమ్ డ్రైవర్స్‌ను రీఇన్‌స్టాల్ చేయండి.

Best Mobiles in India

English summary
15 common Windows Error Codes and how to fix them. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X