మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వరల్డ్ ఛాంపియన్‌గా భారత విద్యార్థి

Posted By:

ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల కుర్రవాడు అర్జిత్ కన్సాల్ 2014 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. పిటంపురాలోని మహారాజా ఆగ్రాసెన్ మోడల్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న కన్సాల్ జూలై 27 నుంచి జూలై 30 వరకు యూఎస్‌లోని కాలిఫోర్నియాలో నిర్వహించిన మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 2010 సాంకేతిక నైపుణ్యాల పోటీలో పాల్గొని ప్రధమ స్థానంలో నిలిచాడు.

 మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వరల్డ్ ఛాంపియన్‌గా భారత విద్యార్థి

ఇందుకు గాను, డిస్నీస్ గ్రాండ్ కాలిఫోర్నియన్ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన బహుమతలు ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ టెస్ట్ డెలివరీ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ సెర్టిపోర్ట్ (Certiport) 5000 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కన్సాల్‌కు బహుకరించింది. ఈ పోటీల్లో థాయిలాండ్‌కు చెందిన పాండ్ సాట్రోన్ దనాబోర్డీపత్ రెండు స్థానంలో నిలవగా, వియత్నామ్‌కు చెందిన పుక్ డుయ్ ట్రాన్ మూడవ స్థానంలో నిలిచారు.

మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ల్, మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్ విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు. నైపుణ్యాల పోటీలకు 4 లక్షల మంది పోటీపడగా. టైటిల్ పోరు నిమిత్తం 130 దేశాల నుంచి 123 ఫైనలిస్టులను నిపుణులు ఎంపిక చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
16-year-old from Delhi named 2014 Microsoft PowerPoint world champion. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot