విండోస్ పీసీ కోసం ఉచిత సాఫ్ట్ వేర్!

By: Madhavi Lagishetty

మార్కెట్ వాటాలో విస్త్రుతంగా వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్ ఒకటి.

విండోస్ పీసీ కోసం ఉచిత సాఫ్ట్ వేర్!

మీ సిస్టమ్ ను మరింత శక్తివంతం చేయడానికి విండోస్ స్టోర్ల నుంచి ఉచితంగా పొందగలిగే 20యాప్స్ జాబితాను మీ కోసం అందిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫైర్ఫాక్స్....

మీరు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోర్రర్ ను అరుదుగా ఉపయోగిస్తే...ఫైర్ఫాక్స్ ను మీ ప్రాధాన్యతలున మార్చడానికి సమయం ఆసన్నమైంది. మ్రుదువుగా...వేగవంతమైనది. పాపప్స్ బ్లాక్ చేస్తుంది. మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొన్ని అద్భుతమైన ప్లగ్-ఇన్ లను పొందవచ్చు.

థండర్ బర్డ్....

మీకు తెలిసినట్లుగా..థండర్ బర్డ్...చాలా లక్షణాలను కలిగిన ఒక ఈ మెయిల్ క్లయింట్. ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే...మీకు ఫిక్స్ చేస్తున్న సైబర్ దాడుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఏ బోగస్ వెబ్ సైట్ ఈమెయిల్ లను స్పష్టంగా సూచిస్తుంది.

సి-క్లీనర్....

మీ సిస్టమ్ నెమ్మదిగా నడుస్తుందా?మీ సిస్టమ్ ను శుభ్రం చెయ్యాలి...ఇది కంప్యూటర్ డ్రైవ్ అవసరంలేని మరియు అనవసరమైన ఫైళ్లను తనిఖీ చేస్తుంది. వాటిని క్లియర్ చేస్తుంది.

BSNL బంపరాఫర్, స్పీడ్ తగ్గకుండా అన్‌లిమిటెడ్ డేటా

రెక్యువా...

ఇది కేవలం సి-క్లీనర్ కి వ్యతిరేఖం. ఈ ఫైల్ రికవరీ సాఫ్ట్ వేర్ ను తొలగించబడిని ఫైళ్లను స్కాన్ చేస్తుంది. యూజర్ వాటిని సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. సాధారణ యూఐగా పనిచేస్తున్నప్పుడు సులభంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు.

వీఎల్సీ మీడియా...

వీఎల్సీ మీడియా ప్లేయర్ పీసీలో మనము చేస్తున్న అతి ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పాటలు, సినిమాలు చూడటం. ఈ సందర్భంగా వీడియో , వీడియో ఫైళ్లన అన్ని ఫార్మాట్లలో ప్లే చేసుకోవడానికి అవసర పడుతుంది.

అడబ్ రీడర్, ప్లాష్ ప్లేయర్ ...

మీకు ఈ-బుక్ రీడింగ్ ఇష్టం ఉంటే లేదా పీడిఎఫ్ ఫైల్ ను తెరవాలనుకుంటే...అడాబ్ రీడర్ అనేది మీరు ఉపయేగించే ఉత్తమ యాప్. మీరు మీ కంప్యూటర్లో ఫ్లాష్ వీడియోలను చూడాలనుకుంటే ఫ్లాష్ ప్లేయర్ తప్పనిసరిగా ఉండాలి.

టీం వ్యూయర్...

రిమోట్ డెస్క్ టాప్ వీక్షణ కోసం ఇది ఉత్తమ సాఫ్ట్ వేర్. ఇక్కడ మీరు మీ డెస్క్ టాప్ ను ఎక్కడి నుండి అయినా సరే షేర్ చేసుకోవచ్చు.

సైబర్ ఘోస్ట్ వీపిఎన్...

మీరు మీ అసలు ఐపి చిరునామాను డిస్ ప్లే చేయకుండా వెబ్లో బ్రౌజ్ చేయాలనుకుంటే...ఈ వీపిఎన్ ఉపయోగపడుతుంది. వెబ్ లో అనేక ఇతర ప్రాక్సీ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్స్ కూడా ఉన్నాయి.

7జిప్....

మీకు తెలిసినట్లుగా ఇది ఫైళ్లన కుదించడానికి మరియు కంప్రెస్ చేయడానికి ఉపయోగపడే ఒక జిప్ ఫైల్ మేనేజర్. చాలాసార్లు ఒక ఫైల్ ను డౌన్ లోడ్ చేస్తున్నప్పుడు అది జిప్ రూపంలో ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక జిప్ మేనేజర్ తప్పనిసరిగా ఉండాలి.

కీ స్క్రాంబ్లర్...

ఇంటర్నెట్ లో కీలాగర్స్ కారణంగా పాస్ వర్డ్ హ్యాక్ చేయబడుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ సాఫ్ట్ వేర్ మీ పాస్ వర్డ్ ను వేరు చేస్తుంది. ఒక కీ లాగర్ ఏదో ఇన్స్ స్టాల్ చేయబడినా కూడా సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.

మాల్వేర్ బైట్...

ఈ సాధనం మీ పీసీలో హానికరమైన ఫైళ్లను విడిచిపెడుతుంది. అదే సమయంలో మీ పీసీ పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది.

GIMP...

ఇంటర్ నెట్ లో లభించే ఉచిత సవరణ సాధనం. అడబ్ ఫోటోషాఫ్ కు సమానమైంది. ఇది గొప్ప లక్షణాలను కలిగి ఉంది.

అడాసిటీ...

ఈ సాఫ్ట్ వేర్ తో మీరు సకంలనం చేయవచ్చు. సౌండ్స్ రికార్డు చేయవచ్చు. పోడ్కాస్ట్ నుండి ఆన్ లైన్ సౌండ్ రికార్డ్ చేస్తుంది. తర్వాత వినడానికి ఉపయోగపడుతుంది.

యు టొరెంట్...

ఇది టొరెంట్ ఫార్మాట్లో ఉన్న ఫైళ్లను డౌన్ లోడ్ చేసే వేదిక. సో ఈ సాఫ్ట్ వేర్ తో మీరు మీ పీసీ లో డౌన్ లోడ్ ఫైల్ తెరవడానికి వీలుంటుంది.

యాంటీ వైరస్...

హానికరమైన వైరస్, బెదిరింపులు, ట్రోజన్లు, మాల్వేర్ , స్పైవేర్ నుండి పీసీ ని కాపాడుకునే మంచి యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయడం తప్పనిసరి. మీరు అవాస్ట్ ఏవీజీ, నార్టన్ ఇంటర్నెట్ సెక్యూరిటీతో సహా కొన్నింటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

K-లైట్ కోడెక్ ప్యాక్....

మీరు మీ పీసీ, ల్యాప్ టాప్ లో మీడియా ఫైల్ ప్లే చేయాలనుకుంటే అప్పడు తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్ వేర్ అన్ని మీడియా ఫైళ్లకు మద్దతు ఇస్తుంది.

నోట్ పాడ్...

వెబ్ ఆధారిత అప్లికేషన్స్, వెబ్ సైట్లు స్రుష్టించడానికి ఈ సాప్ట్ వేర్ ను ఉపయోగించవచ్చు. మీ అప్లికేషన్ లేదా వెబ్ సైట్ అభివ్రుద్ధి అలాగే హెచ్ఎంటీఎల్, జావాస్క్రిప్ట్ ఫైథాన్, సీఎస్ ఎస్ వంటి పలు ప్రోగ్రామింగ్ భాషలను ఉపయోగించవచ్చు.

ఫైల్ జిలా...

మీరు ఇతర కంప్యూటర్లకు ఎఫ్టీపీ పైళ్లను కావాలనుకుంటే...మీరు ఫైల్ జిలా సహాయంతో ఫైల్లను వేగంగా బదిలీ చేయవచ్చు.

ట్రూక్రిప్ట్....

ఈ సాఫ్ట్ వేర్ మెమోరీ స్టిక్ ని గట్టిగా గుప్తీకరించిన డేటా నిల్వ పరికరంగా మార్చడానికి వినియోగదారున్ని అనుమతిస్తుంది. ఇకపై డేటా కోల్పోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

జ్యూస్...

ఈ సాఫ్ట్ వేర్ మిమ్మల్ని పాడ్కాస్ట్లకు సబ్ స్ర్కయిబ్ చేయడానికి అనుమతిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Today, we have curated a list of 20 apps that you can avail from Windows stores for free to make your system more productive and powerful.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot