మార్కెట్లోకి యాపిల్ ఐమ్యాక్ కంప్యూటర్లు!

Posted By: Prashanth

మార్కెట్లోకి యాపిల్ ఐమ్యాక్ కంప్యూటర్లు!

 

టెక్ టైటాన్ యాపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన 21.5 అంగుళాల శ్రేణి ఐమ్యాక్ ఇంకా మ్యాక్ మినీలు ఇండియన్ స్టోర్‌లలో లభ్యమవుతున్నట్లు ఆపిల్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. దేశీయ మార్కెట్లో 21.5 అంగుళాల శ్రేణి ఆపిల్ ఐమ్యాక్ ధరను రూ.85,900గా, మూడు వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న మ్యాక్ మినీ ప్రారంభ ధరను రూ.39,990గా ఆపిల్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడవ తరం ఆల్-ఇన్-వన్ పీసీలు మునుపటి తరం మోడల్స్‌తో పోలిస్తే మరింత స్లిమ్ తత్వాన్ని సంతరించుకుని ఉంటాయి.

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

ఐమ్యాక్ ప్రత్యేకతలు:

కోర్ ఐ5, కోర్ ఐ7 క్వాడ్ ప్రాసెసర్లు, ఎన్-విడియా కిప్లర్ గ్రాఫిక్స్, డ్యూయల్ మైక్రోఫోన్స్, డ్యూయల్ స్పీకర్స్, థండర్ బోల్ట్ పార్ట్స్, 32జీబి ర్యామ్, 128జీబి ఫ్లాష్ డ్రైవ్, ఫ్యూజన్ మెమెరీ 1 నుంచి 3 టాబ్‌ల వరకు, ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా (720పిక్సల్ రిసల్యూషన్), యూఎస్బీ 3.0 పోర్ట్స్ (4).

అప్‌డేటెడ్ మ్యాక్ మినీ స్సెసిఫికేషన్‌లు:

కోర్ ఐ5 ఇంకా ఐ7 డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌లు,

వేగవంతమైన గ్రాఫిక్ వ్యవస్థ,

4జీబి మెమెరీ, 16జీబి ఎక్ప్‌ప్యాండబుల్,

యూఎస్బీ 30 పోర్ట్స్ (4), ఫైర్ వైర్ 800, హెచ్‌డిఎమ్ఐ, ఎస్‌డిఎక్స్‌సీ,

థండర్ బోల్ట్ పార్ట్స్,

గిగాబిట్ ఇతర్ నెట్.

ఈ అందాలకు బడాబాబులు ఫిదా? (గ్యాలరీ)

బ్లాక్‌బెర్రీ భవిష్యత్ మోడల్స్ (ఫోటో గ్యాలరీ)!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot