ఈ షార్ట్ కట్ కీస్‌తో కంప్యూటర్‌ను ఆడేసుకోవచ్చు

Written By:

చాలామంది కంప్యూటర్ నేర్చుకోవాలని అదీ ఫాస్ట్ గా టైప్ చేయలని తెగ ఆరాటపడుతుంటారు..అయితే వారికి షార్ట్ కట్ కీస్ తెలియక కూడా ఒక్కో సారి వారు ఫాస్ట్‌గా టైప్ చేయలేక వెనుకబడిపోతుంటారు.. అయితే అలాంటి వారు కీ బోర్డ్‌లో షార్ట్ కట్ కీలు గురించి ఎక్కడబడితే అక్కడ తెగ వెతికేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం గిజ్‌బాట్ కీ బోర్డ్‌లో కొన్ని షార్ట్ కట్ కీస్ ని అందిస్తోంది..దీనిపై మీరు ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ +డి ( Windows+ D)

1

మీరు అన్ని అలానే ఉంచి నేరుగా డెస్క్ టాప్ మీదకు వెళ్లాలంటే ఈ బటన్స్ ని ప్రెస్ చేయండి.

కంట్రోల్ + ఎఫ్4 ( Control+ F4)

2

మీరు మీ ప్రోగ్రాంను క్లోజ్ చేయాలంటే దీన్ని ఉపయోగించండి

ఆల్ట్ +ట్యాబ్ ( Alt+ Tab)

3

మీరు ఏదైనా ప్రోగ్రాం నుంచి మరో పోగ్రాంలోకి వెళ్లాలంటే దీన్ని ఉపయోగించండి.

కంట్రోల్ + ఎల్ ( Control+ L)

4

మీరు ఇంటర్నెట్ చూస్తున్నప్పుడు నేరుగా అడ్రస్ బార్ లోకి వెళ్లాలంటే దీన్ని నొక్కితే చాలు

కంట్రోల్ + టీ ( Control+ T)

5

మీరు ఇంటర్నెట్ చూస్తున్నప్పుడు కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేయాలంటే దీన్ని ప్రెస్ చేయండి.

కంట్రోల్ +బ్యాక్ స్పేస్ ( Control+ Backspace)

6

ఈ బటన్ నొక్కితే మీ కర్సర్ ఉన్న చోటు నుంచి ముందు భాగం మొత్తం డిలీట్ అవుతుంది.

కంట్రోల్ +డిలీట్ ( Control+ Delete)

7

ఈ బటన్ నొక్కితే మీ కర్సర్ ఉన్న చోటు నుంచి తరువాత మొత్తం డిలీట్ అవుతుంది.

కంట్రోల్ + జడ్ ( Control+ Z)

8

మీరు ఏదైనా మిస్టేక్ చేసి మళ్లీ పాతదానికి వెళ్లాలంటే దీన్ని ఉపయోగించవచ్చు.

షిప్ట్ + ఎండ్ ( Shift+ End)

9

మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే మీ కర్సర్ ఉన్న చోటు నుంచి కుడివైపు భాగం మొత్తం సెలక్ట్ అవుతుంది.

షిప్ట్ + హోమ్ ( Shift+ Home )

10

మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే మీ కర్సర్ ఉన్న చోటు నుంచి ఎడమభాగం మొత్తం సెలక్ట్ అవుతుంది.

కంట్రోల్ +ఎండ్ ( Control+ End )

11

మీరు ఎక్కడున్నా కాని ఈ బటన్ ప్రెస్ చేస్తే చివరి పేజీ లో చివరి లెటర్ దగ్గరకు వెళతారు.

కంట్రోల్ + హోమ్ ( Control+ Home )

12

మీరు ఎక్కడున్నా కాని ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ పేజీ లో ఫస్ట్ లెటర్ దగ్గరకు వెళతారు.

షిప్ట్ + యారోస్ ( Shift+ Aroows )

13

వీటి ద్వారా మీరు అనుకున్న దాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు.

కంట్రోల్ + a+c+n+v ((Control+ A+C+N+V)

14

కొత్త డాక్యుమెంట్ లో మీరు అనుకున్న దాన్ని డైరెక్ట్ గా కాఫీ పేస్ట్ చేయవచ్చు.

కంట్రోల్ + వీ (Control+ V)

15

ఇది నొక్కడం ద్వారా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మీరు కాపీ చేసిన డాక్యుమెంట్ మొత్తాన్ని అనుకున్న చోట పేస్ట్ చేసుకోవచ్చు.

కంట్రోల్ + సీ ((Control+ C)

16

ఇది నొక్కడం ద్వారా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మీరు డాక్యుమెంట్ మొత్తాన్ని కాఫీ చేసుకోవచ్చు.

కంట్రోల్ + ఎక్స్ (Control+ X)

17

ఇది నొక్కడం ద్వారా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మీరు డాక్యుమెంట్ మొత్తాన్ని కట్ చేసుకోవచ్చు.

కంట్రోల్ + ఎ (Control+ A)

18

ఇది నొక్కడం ద్వారా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మీరు డాక్యుమెంట్ మొత్తాన్నిసెలక్ట్ చేసుకోవచ్చు.

ఎఫ్ 12 ( F12)

19

ఇది డైరెక్ట్ గా సేవ్ యాస్ చేసే బటన్. మీరు సేవ్ చేసినదాన్ని మరో చోట సేవ్ చేయాలంటే దీన్ని నొక్కవచ్చు.

కంట్రోల్ + ఎస్ (Control+ S)

20

ఇది నొక్కడం ద్వారా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో మీరు డాక్యుమెంట్ ను సేవ్ చేసుకోవచ్చు.

కంట్రోల్ + ఓ (Control+ O)

21

ఇది నొక్కడం ద్వారా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు.

కంట్రోల్ +ఎన్ (Control+ N)

22

ఇది నొక్కడం ద్వారా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 22 tricks you master to become a keyboard ninja
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting