ఫేస్‌బుక్‌లోనూ మోడీ ప్రబంజనం

Posted By:

2014, సార్వత్రిక ఎన్నికల పై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగానే చూపినట్లు తాజా విశ్లేషణల ద్వారా వెల్లడవుతోంది. ఎన్నికల నగరా మోగిన నాటినుంచి దేశనలుమూలల నుంచి లక్షలాది మంది ఫేస్‌బుక్ యూజర్లు సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని పరస్పర చర్చా వేదికల్లో ఏదో విధంగా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.

 ఫేస్‌బుక్‌లోనూ మోడీ ప్రబంజనం

సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన నాటి నుంచి 29 మిలియన్ల భారతీయ ఫేస్‌బుక్ యూజర్లు ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన దాదాపు 227 మిలియన్లు పరస్పర చర్చల్లో పాలుపంచుకున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. వీరిలో 13 మిలియన్ల మంది 75 మిలియన్ల చర్చల్లో నరేంద్ర మోడీ గురించి చర్చించుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

అంతర్జాతీయంగా నరేంద్ర మోడీ తరువాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బరకా ఒబామా, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లు ఈ విశ్లేషణలో ద్వారా తేటతెల్లమైంది. దేశీయంగా భారతీయ జనతా పార్టీకి 45.31 లక్షల ఫేస్‌బుక్ అభిమానులు, కాంగ్రెస్‌కు 33.09 లక్షల అభిమానులు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21.19 లక్షల ఫేస్‌బుక్ అభిమానులు ఉన్నట్లు సదరు విశ్లేషణలో తేలింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting