టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. రేపటి తరం సాంకేతికతకై పరిశోధనలు ముమ్మరం చేసిన మైక్రోసాఫ్ట్, ట్రాన్స్‌పిరెంట్ OLED డిస్‌ప్లేతో కూడిన 3D డెస్కుటాప్‌కు రూపకల్పన చేసింది. కైనెక్ట్ వ్యవస్థను ఈ డెస్క్‌టాప్‌లో దోహదం చేయటంతో చేతి సైగలు, హావభావాలు, కంటి చూపు ద్వారా కంప్యూటింగ్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చ. కైనెక్ట్ టెక్నాలజీ ద్వారా డెస్క్‌టాప్‌లో ఏర్పాటు చేసిన కెమెరా అదేవిధంగా సెన్సార్స్ ఆధారితంగా ఈ పక్రియ సాధ్యమవుతుంది. OLED స్ర్కీన్ ద్వారా వాస్తవ సమయంలోనే విర్చువుల్ అనుభూతికి వినియోగదారుడు లోనవుతాడు. స్ర్కీన్ కింద భాగంలో ఏర్పాటు చేసిన కోబోర్డ్ సాధారణ బటన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. పొందుపరిచిన కైనెక్ట్ వ్యవస్థ ద్వారా శ్రోత 3డి పరస్పర చర్య నుంచి 2డి పరస్పర చర్యకు మారిపోవచ్చు. డెస్క్ టాప్ ఎదురుగా కూర్చుని పని చేసే వక్త వాస్తవం సమయంలోనే వింత అనుభూతులకు లోనవుతాడు. తద్వారా చేస్తున్న పని పట్ల మరింత ఉత్సకత కనబరుస్తాడు. ఈ డివైజ్ పనితీరు అదే విధంగా వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని విజువల్స్ రూపంలో http://www.youtube.com/watch?v=oGa1Q7NvsI0&feature=player_embedded ద్వారా తిలకించవచ్చు.