3డి టాబ్లెట్... ఈ ఏడాది లోనే..?

Posted By: Staff

3డి టాబ్లెట్... ఈ ఏడాది లోనే..?

 

ఇక ఎంచక్కా ‘3డి’ అనుభూతులను టాబ్లట్ కంప్యూటర్ లో వీక్షించవచ్చు. ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు అసస్ ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ‘Eee Pad MeMO’ మోడల్ లో 3డి టాబ్లెట్ ను డిజైన్ చేసింది. ఈ ఏడాది ప్రధమాంకంలో అందుబాటులోకి రానున్న ఈ మోడ్రన్ గ్యాడ్జెట్ ముఖ్య విశేషాలు...

అధ్యంతం 3డీ అనుభూతికి లోను చూసే ‘parallax-barrier’ వ్యవస్థను ఈ టాబ్లెట్ లో పొందుపరిచారు. 7 అంగుళాల టాబ్లెట్ స్క్రీన్ పెద్ద తెర అనుభూతిని కలిగిస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 3.0 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో సులువైన కంప్యూటింగ్ కు దోహదపడుతుంది.

పొందుపరిచిన డ్యూయల్ కోర్ 1.2 GHz స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ టాబ్లెట్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. 1జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజి, 3.5mm ఆడియో అవుట్, సిమ్‌కార్డ్ స్లాట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మినీ హెచ్డీఎమ్ ఐ పోర్టు, 5 మెగా పిక్సల్ (రేర్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వంటి మన్నికైన ఫీచర్లు వినియోగదారుడికి లబ్ధి చేకూరుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot